స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్లు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్‌ను శాసించిన ఈ ముద్దుగుమ్మ.. ఇంచుమించు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోను నటించింది. తర్వాత మెల్లమెల్లగా అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరమైంది. ఇటీవల మళ్ళీ పలు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారుతున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ లో మాత్రం దూరంగానే ఉంటుంది.
ఇక ప్రస్తుతం ట్రలాల పేరుతో సొంత ప్రొడెక్షన్ బ్యానర్ స్థాపించి.. అదే బ్యానర్‌పై తనే హీరోయిన్‌గా మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది. మరోపక్క రక్త బండారు లాంటి వైవిధ్యమైన కథతో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అంటూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
మీరు వ్యక్తితో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారేమో.. కానీ మానసికంగా శారీరకంగా, ఆరోగ్యంగా లేనప్పుడు మీరు కోరుకున్న భాగస్వామికి నచ్చినట్లుగా ఉండలేరు, కనిపించలేరు అంటూ వివరించింది. ఓ వ్యక్తి పైకి అందంగా కనిపించిన మానసిక ప్రశాంతత ఉండదు. ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతే ఏదో ఒక సమయంలో మనం మన లైఫ్ పార్ట్నర్‌ను కోల్పోవాల్సి ఉంటుందంటూ తన మనసులో మాటను షేర్ చేసుకుంది. ప్రస్తుతం సమంత ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.