విజయ్ రష్మికను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ అనే వైవిధ్య‌మైన కథతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గౌతం తిన్ననూరే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీస్, ఆడియన్స్ విజయ్ దేవరకొండను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా టీజర్‌కు రష్మిక కూడా రియాక్ట్ అవుతూ.. విజయ్‌ను ప్రశంసించింది.

Kingdom (2025 film) - Wikipedia

ప్రస్తుతం ఆ పోస్ట్ ట్రెండింగ్‌గా మారింది. ర‌ష్మిక‌.. అతను ఎప్పుడు ఏదో కొత్త తరహాలో, డిఫరెంట్ వేలో ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతిసారి ఓ అద్భుతంతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. విజయ్, నిన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్న అంటూ రష్మిక ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ గా మారడంతో రష్మిక పోస్ట్‌కు విజయ్ రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలోనే విజయ్‌, రష్మీకను ఏ ముద్దు పేరుతో పిలుస్తాడో కూడా రివీల్ చేశాడు. రష్మికను.. రుషి అంటూ సంబోధిస్తూ రిప్లై ఇవ్వడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

Vijay Deverakonda's 'Kingdom' teases intense action, to be released on May  30

ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో కింగ్‌డ‌మ్ టీజర్ వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ ఏడది మే 31న గ్రాండ్గా రిలీజ్ కానున ఈ సినిమాకు.. తారక్ వాయిస్ ఓవర్ అందించడం మరింత హైలెట్గా నిలిచింది. తమిళ్‌లో సూర్య ఈ సినిమాకు వాయిస్ ఇవ్వ‌నున్నారట. అలాగే హిందీలో రాణ్‌బీర్‌ కపూర్ వాయిస్ ఓవర్ అని సమాచారం. యుద్ద నేపథ్యంతో సినిమా ఉన్నట్లు టీజర్ చూస్తే క్లారిటీ వస్తుంది. మరి ట్రైలర్ లో ఎలాంటి హైప్‌ క్రియేట్ అవుతుందో.. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.