టాలీవుడ్ నటుడు రవిబాబుకు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. కామెడీ విలన్ పాత్రలోను నటించి ఆకట్టుకున్నాడు. సడన్గా నటనకు చెక్ పెట్టేసి పూర్తిగా డైరెక్టర్గా మారాడు. ఇక అల్లరి నరేష్‌ను అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత రవి బాబుదే. ఇక రవిబాబు సీనియర్ నటుడు చలపతిరావు కొడుకు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి రవిబాబు అప్పటికే అమరావతి, నువ్విల, అవును, అవును 2 ఇలా ఎన్నో సినిమాలను రూపొందించాడు. తన ప్రతి సినిమాకు ఆ అనే పదాన్ని సెంటిమెంట్ గా వాడుతూ వస్తున్న రవిబాబు.. తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమా టైటిల్ ముందు ఈ అక్షరాన్ని కచ్చితంగా ఉంచుతాడు.
అలాంటి రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో పై ఇండైరెక్ట్ కామెంట్లు చేశాడు. నాకంటే హైట్ తక్కువగా ఉండే హీరో సినిమాలో నటించాలని అడిగారు చేయనన్న.. మీరు సినిమాలో నటించాల్సిందేనని వారు పట్టుబట్టారు. ఇక ఆ హీరో నాకంటే పొట్టిగా ఉంటాడు కనుక ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తేనే నటిస్తా అని వాళ్ళతో చెప్పా అంటూ రవిబాబు ఇంటర్వ్యూలో సెటైరికల్ కామెంట్లు చేశాడు. అయితే.. రవిబాబు మాట్లాడిన మాటలకు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సింహాద్రి మూవీ జూనియర్ ఎన్టీఆర్, నాజర్, రవిబాబు ముగ్గురు కలిసి కనిపించిన సీన్ చూపించారు.
దీంతో రవిబాబు పొట్టిగా ఉంటాడంటూ హైట్ గురించి చేసిన కామెంట్స్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ని అంటే కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఒక హీరోకు సంబంధించి ఏదైనా వీక్ పాయింట్ ఉంటే మిగతా హీరోలు దానినే ట్రోల్స్ చేస్తూ తెగ ట్రెండ్ చేయడం కామన్. అలా ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు తారక్ యాంటీ ఫ్యాన్స్. అయితే.. రవిబాబు పేరు చెప్పకుండా పరోక్షంగా చేసిన కామెంట్స్ ఎన్టీఆర్‌కు సంబంధించేనా.. లేదా.. తెలియదు కానీ చాలామంది మాత్రం సోషల్ మీడియాలో రవిబాబు కామెంట్లను ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.