మాస్‌ కా దాస్‌కు వైసీపీ పంచ్.. డిజాస్టర్ లైలా అంటూ ట్రెండ్..!

టాలీవుడ్ మాస్ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తాజాగా నటించిన మూవీ లైలా సినిమాకు వైసీపీ శ్రేణుల నుంచి చిచ్చు మొద‌లైంది. ఈ సినిమా ఫిబ్రవరి 14 అంటే నేడు గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలను పూర్తిచేసుకుంది. ఇక మూవీ చూసిన ఆడియ‌న్స్‌ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను తెలియజేస్తున్నారు. కొంతమంది సినిమా బాగుందని రివ్యూ ఇస్తుంటే.. మరి కొంతమంది సినిమా యావరేజ్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు వైసీపీ మాత్రం గట్టి దెబ్బ కొడుతోంది. హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

వైసీపీ ఫ్యాన్స్ ఇప్పటికే లక్షకు పైగా ఇదే మెసేజ్ షేర్ చేయ‌డం హ‌ట్ టాపిక్‌గా మారింది. వైసీపీ కార్యకర్తలు హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా ట్యాగ్‌ పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. ఒక్కో ఎకౌంటు నుంచి వందల సంఖ్యలో ఇదే ట్విట్‌లు వెలివ‌డుతున్నాయి. దీంతో ప్రస్తుతం హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ లైలా ట్రెండిగా మారింది. ప్రతినిమిషానికి డిజాస్టర్ లైలా ట్యాగ్స్‌.. క్రమక్రమంగా పెరిగిపోతూ వస్తున్నాయి. దీంతో లైలా సినిమా టీం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పిన వైసీపీ నేతలు దిగరావడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో సినిమాకు సంబంధం లేదని.. హీరో చెప్పినా పట్టించుకోవడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Vishwak Sen gets emotional as he apologises on behalf of his 'Laila' co-star Prudhvi Raj's political remark that sparked boycott trend against the movie | Telugu Movie News - The Times of

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ వైసీపీని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ర‌చ్చగా మారిన సంగతి తెలిసిందే. 150 మేకులు కాస్త 11 మేకులు అయ్యాయి అంటూ లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడాడు. దీంతో వైసిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేముంది సోషల్ మీడియాని వాడుకునే లైలా సినిమాకు పూర్తిగా వ్యతిరేకత సృష్టించారు. దెబ్బకు తెల్లారేసరికి విశ్వక్ దిగివచ్చి సారీ చెప్పాడు. కానీ.. పృథ్వీరాజ్ సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్లు మొదలయ్యాయి. పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పకుండా ఆసుపత్రికి వెళ్లి మళ్లీ వైసీపీ నేతలపై మండిపడ్డాడు. ఇక నిన్న అర్ధరాత్రి పృథ్వీరాజ్ వైసీపీ శ్రేణులకు క్షమాపణలు తెలియజేశాడు. అయినప్పటికీ వైసీపీ నేతలు కోపం మాత్రం తగ్గలేదు. లైలా సినిమాను టార్గెట్ చేస్తూ మరిన్ని పోస్టులు షేర్ చేస్తున్నారు.