టాలీవుడ్‌లోనే కాంట్రవర్షియల్ హీరోగా విశ్వక్‌సేన్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈయన నటించిన ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుండడం.. కావాలనే కాంట్రవర్సీలను సృష్టిస్తున్నారా.. లేదా అనుకోకుండా అలా జరిగిపోతున్నాయో తెలియదు కానీ.. ప్రతి సినిమాకు ఏదో ఒక వాదనలు వినిపించడంతో విశ్వక్‌సేన్‌కు కాంట్రవర్షియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ నుంచి వచ్చిన లైలా మూవీ రిలీజ్‌కు ముందు కూడా పృథ్వీరాజ్ ఈవెంట్‌కి వచ్చి వైసీపీపై పరోక్షంగా కౌంటర్లు వేయడంతో ఈ సినిమా ముందు కూడా రచ్చ ఏర్పడింది. అయితే ఈ విషయంలో విశ్వక్‌సేన్ కల్పించుకొని క్షమాపణలు చెప్పినా.. వైసీపీ మాత్రం ఇంకా కూల్ కాలేదు. సోషల్ మీడియాలో లైలా సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. నేడు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమాను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రీమియర్‌షోస్ చూసిన జనం ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మాస్ కా దాస్ హిట్ కొట్టాడా.. లేదా బొక్క బోర్లా పడ్డాడో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా విశ్వక్ నటించిన లైలా సినిమాలో లేడీ గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. విశ్వక్ లేడీ గెటప్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ క్రమంలోనే సినిమాల్లో తన నటనకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కొంతమంది మాత్రం సినిమా బోరింగ్‌గా ఉందని.. టైం వేస్ట్, మనీ వేస్ట్ అంటూ పూర్తిగా ఊహించినట్లుగానే కథ నడుస్తుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరికొంతమంది పర్వాలేదు ఓవరాల్‌గా స్టోరీ నచ్చిందని.. సినిమాను కచ్చితంగా చూడొచ్చు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమందేమో ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది స్టోరీ అంత రొటీన్‌గా ఉన్న విశ్వక్ నటన ఆకట్టుకుందని.. సినిమా కోసం పడిన ఆయన కష్టం కనపడుతుందని తన కష్టానికి తగ ఫలితం అయినా వస్తే బాగుంటుందంటూ రివ్యూ లో వెల్లడిస్తున్నారు. ఇక విశ్వక్‌సేన్ వన్ మ్యాన్ షోతో ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు తెలుస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా కొంతమంది పాజిటివ్‌గా రివ్యూ ఇస్తుంటే.. మరి కొంతమంది నెగటివ్ గా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మరికొద్ది గంటల్లో సినిమా ఫుల్ రివ్యూ వస్తే గాని.. ఆడియన్స్‌ను సినిమా ఎలా ఆకట్టుకుందో తెలుస్తుంది.