టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి తండ్రి కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ మంచిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చంద్రశేఖర్‌కు పితృవియోగం జరిగింది. తాజాగా చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు తుదిశ్వాస విడిచాడు. 75 ఏళ్ల వయసులో అనారోగ్య‌కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏలేటి సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లా, తుని మండలంలోని రేఖ వ‌నిపాలెంలో ఉంటున్నారు. ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి, రాజమౌళి భార్య రామా రాజమౌళి.. ఏలేటి సుబ్బారావు కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ పరామర్శించి వచ్చారు. చంద్రశేఖర్ ఏలేటి వైవిధ్యమైన సినిమాలు తీస్తు జ‌నంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

అలాంటి డైరెక్టర్ తండ్రిని కోల్పోవడం బాధాకరం అంటూ ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఆయన నివాసానికి బయలుదేరారు. ఇక చంద్ర‌శేఖ‌ర్ ఐతే సినిమాతె కెరీర్‌ ప్రారంభించారు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు, నంది అవార్డు లాంటి రెండు ప్రెస్టేజ్ అవార్డులను సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి ఘనత చంద్రశేఖర్‌కు దక్కింది. దీంతో నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టేవారు. ఇక ఇతర సినిమా దర్శకులతో పోలిస్తే ఆయన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి.

ఇక ఐతే సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని అనుకోకుండా ఒక రోజు సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు చంద్రశేఖర్. ఈ సినిమా కూడా నంది అవార్డును గెలుచుకోవడంతో మరోసారి తన సత్తా చాటుకుని.. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కాగా నితిన్ హీరోగా నటించిన చెక్.. చివరి సినిమా. ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా కొందరికీ మాత్రమే పరవాలేదనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రశేఖర్ మరో సినిమాను తెర‌కెక్కించలేదు అలా ఇప్పటికే ఆయన సినిమా వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. ఇలాంటి క్రమంలో తండ్రి మరణంతో ఏలేటికి కోలుకోవాలని దెబ్బ తగిలిందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.