నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాబి కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ జనవరి 12న యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబి విజన్, థమన్ మ్యూజిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఈ హై యాక్షన్ వోల్టేజ్ మూవీ కలెక్షన్ల పరంగా కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ సెవెంత్ డే కలెక్షన్స్ లెక్కలు ఒకసారి చూద్దాం. ఫుల్ ఆఫ్ మాస్ ఎంటర్టైనర్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవరనాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించగా.. బాబి డియల్, శ్రద్ధ శ్రీనాద్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేల, సచిన్ ఖేడ్‌కర్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలో మెప్పించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు థమన్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. ఇక రిలీజ్‌కు ముందే సినిమా విపరీతమైన హైప్ నెలకొల్పడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.80 కోట్లను జరుపుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.82 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు బాలయ్య సినీ కెరీర్‌లోనే హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా డాకు మహారాజ్ రికార్డును సృష్టించింది. ఇక కలెక్షన్ వివరాలు పాజిటివ్ టాక్‌తో మొదటి రోజే భారీ కలెక్షన్స్‌తో కొల్లగొట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే రూ.25.35 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.56 కోట్ల వసూళను సాధించడం విశేషం.
దీనిని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక రెండో రోజు రూ.13.5 కోట్లు, మూడో రోజు రూ.12.50, నాలుగవ రోజు రూ.9.57 కోట్ల, ఐదవ రోజు రూ.6.25 కోట్లు, ఆరవ రోజు రూ.4.20 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆరు రోజుల్లో రూ.124 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. అలాగే సంక్రాంతి బరిలో వన్ మ్యాన్ షో చేస్తూ బాలయ్య ర్యాంపేజ్ చూపించాడు. అయితే డాకు మహారాజ్ 7వ రోజు కలెక్షన్స్ కాస్తమేరా నెమ్మదించినట్లు తెలుస్తుంది. స్టాక్‌మిల్ అంచనాల ప్రకారం డాకు మహారాజు 7వ రోజు కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.3.96 కోట్ల వరకు మాత్రమే వచ్చినట్లు సమాచారం. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్ మొత్తం గా రూ.74.58 కోట్ల వసూళ్ళు కొల్లగొట్టినట్లు సమాచారం. వీకెండ్ కావడంతో నేడు కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతి బరిలో బాలయ్య మంచి కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్నారు.