గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుక జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో థియేటర్లలో ఇప్పటికీ కొనసాగుతుంది. ఫస్ట్ డే రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. మెల్లమెల్లగా కలెక్షన్లను తగ్గించుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో 9వ రోజు చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈభారీ బడ్జెట్ సినిమాలో కియారా ఆధ్వని, అంజలి హీరోయిన్లుగా కనిపించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్‌కు తగ్గట్టుగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరిగినట్లు తెలుస్తుంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.145 కోట్ల మేర జరగగా.. రూ.150 కోట్ల షేర్‌తో.. రూ.300 కోట్ల గ్రాస్ టార్గెట్‌ను ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి. కాగా స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల వసూలు సాధించిన ఈ సినిమా.. తర్వాత రెండో రోజు నుంచి మెల్లమెల్లగా కలెక్షన్‌లు డౌన్ అవుతూ వచ్చింది. రెండో రోజు రూ.21.6 కోట్లు, మూడో రోజు రూ.17కోట్లు, నాలుగో రోజు 8.50కోట్లు, ఐదవ రోజు రూ.10.19 కోట్లు, ఆరవ రోజు రూ.7.11కోట్లు, ఏడవ రోజు 4.5కోట్లు, 8వరోజు 2.75 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
అలా గేమ్ ఛేంజర్.. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఇకపోతే గేమ్ ఛేంజర్ 9వ రోజు కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.02 ఉన్నా..తమిళ్లో రూ.0.15 కోట్లు , హిందీలో 41 లక్షలు, కర్ణాటక, కేరళ, ఇండియా రెస్టాఫ్ అని ఏరియాలనింటిని కలిపి 11 లక్షల చొప్పున మొత్తం గా రూ.2.58 కోట్ల వసూలు వచ్చాయి. ఇక చరణ్ గేమ్ ఛేంజర్‌కు నెగెటివిటీ, మిక్స్డ్ టాక్ వస్తున్నా.. మధ్యలో కాస్త పుంజుకుందనే సమయానికి మళ్ళీ హిందీ బెల్ట్ లో ఒకసారిగా వసూళ్లు డౌన్ అయిపోవడంతో గేమ్ ఛేంజర్ యూనిట్‌లో ఆందోళన మొదలైంది.