ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు స్టార్ హీరోలు సినిమాలు సిద్దమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నందమూరి నటసింహం బాలయ్య నుంచి డాకుమహరాజ్ సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించకుంటూ జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. గత కొద్దిరోజులుగా బాలయ్య నటిస్తున్న వరుస సినిమాలు రూ.100 కోట్లు కలెక్షన్లు రాబడుతూ ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడం బాలయ్య ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ను అభినందిస్తూ మూవీ టీంకు ఎంతోమంది సెలబ్రిటీస్ ప్రశంసలు అందిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసుకుంటున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తాజాగా బాలయ్య సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ నిర్మాత నాగవంశీకి బొక్కే ద్వారా విషెస్ తెలియజేశారు. నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా ఇది షేర్ చేసుకుంటూ.. సినిమా మంచి సక్సెస్ అయినందుకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ.. పూలబోకే ఇచ్చిన అల్లు అర్జున్ గారికి ఎంతో కృతజ్ఞతలు అంటూ షేర్ చేసుకున్నాడు నాగ వంశీ. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో.. బన్నీ, బాలకృష్ణ సినిమాకు ప్రశంసలు కురిపిస్తూ పూల బుక్కే పంపించడానికి పరోక్షంగా చరణ్ సినిమా బాలేదని చెప్పడమే అర్ధమ అంటూ.. ఇప్పటివరకు అసలు చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను బన్నీ చూశాడా.. లేదా అంటూ.. కావాలనే మెగా హీరోను అవమానిస్తున్నాడంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే చరణ్ సినిమా గురించి బన్నీ ఇప్పటివరకు ఏమాత్రం స్పందించకపోగా.. బాలయ్య సినిమా సక్సెస్ పై ఫ్లవర్ బొకే పంపించి మరీ విషెస్ తెలియజేయడంతో మెగా ఫ్యాన్స్ మరోసారి అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. ఇక తాజాగా బన్నీ పుష్ప 2 రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రూ.18 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత.. బన్నీ, త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు రూ.500 కోట్ల బడ్జెట్ అవుతుందని.. నాగవంశీ దీనికి ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నట్లు సమాచారం.