ఎన్టీఆర్ పిల్లల కోసం స్టెరాయిడ్ తీసుకున్నాడా.. సంచలన నిజాలు రివీల్ చేసిన హరికృష్ణ..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. న‌టుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 1943లో బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు. వీరికి 12 మంది సంతానం కాగా ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీళ్ళలో బాలయ్య, హరికృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి ఈ నలుగురు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Lakshmi Parvathi hails NTR district

మిగిలిన వారంతా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. అయితే 1985లో క్యాన్సర్‌తో బసవతారకం మరణించింది. దీంతో ఆమె గుర్తుగా క్యాన్సర్‌తో ఎవరు చనిపోవద్దని.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించాడు ఎన్టీఆర్. అయితే బసవతారకం చనిపోయిన కొన్నాళ్లకే లక్ష్మీపార్వతికి అయన దగ్గరై ఆమెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రైటర్‌గా, ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె హ‌వ‌భావాలు సపోర్ట్‌.. ఎన్టీఆర్‌కు బాగా నచ్చడంతో ఆమెను ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. చంద్రబాబు కూడా దానిని వ్యతిరేకించారని.. అప్పట్లో వార్తలు అయ్యాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ మరణానికి కూడా కారణం లక్ష్మీపార్వతి అని.. హరికృష్ణ గతంలో ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్‌ను వైరల్ చేస్తున్నారు.

Vice-President, Politicians, Celebrities Pay Last Respects To Harikrishna

నాన్నగారు 72 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆయనకు అప్పటికే హాట్ స్ట్రోక్ వచ్చింది. అయినా అలాంటి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ తీసుకోవడమే అయినా ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని.. డాక్టర్లు కూడా ఇదే చెప్పారంటూ హరికృష్ణ గ‌తంలో మీడియాతో హ‌రికృష్ణ వెల్లడించాడు. ఎన్టీఆర్‌ స్టెరాయిడ్స్‌ కారణంగా మరణించారని.. లేదంటే నూరేళ్లు సంతోషంగా ఉండేవారు అంటూ హరికృష్ణ వెల్లడించాడు. అంతేకాదు.. ఇదే నేపథ్యంలో లక్ష్మీపార్వతి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హరికృష్ణ.. ఆ ఏజ్‌లో ఆమె రికానలైజేషన్ ఆపరేషన్ చేయించుకుందని వివరించాడు. ఇక ఈ ఆపరేషన్ పిల్లలు పుట్టడానికి.. ఆడవాళ్లు చేయించుకునే ఆపరేషన్. ఆ ఏజ్‌లో ఆమె చేయించుకున్న ఆపరేషన్.. ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ తీసుకోవడం.. ఇవన్నీ వాళ్లకు పిల్లలు పుట్టాలని చేసిన ప్రయత్నం అని.. అలా లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ మరణించారని.. లేదంటే వందేళ్లు బ్రతికే వారిని హరికృష్ణ చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల క్రితం హరికృష్ణ మీడియాతో షేర్ చేసుకున్న ఈ విషయాలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారుతున్నాయి.