సంక్రాంతికి సందడి అంతా ఈ బుల్లి రాజుదే.. ఇంతకి సినిమాలో ఛాన్స్ ఎలా కొట్టేసాడంటే..?

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ క‌లెక్ష‌న్‌ల‌తో వెంకీ మామ సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమాల్లో.. అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఒక పిల్లాడు నిలిచిన సంగతి తెలిసిందే. అదే బుల్లి రాజు పాత్రలో నటించిన బీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మూవీలో వెంకటేష్ కుమారుడిగా నటించిన రేవంత్.. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు.

సంక్రాంతి సందడి అంతా బుల్లిరాజుదే! సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హైలైట్‌గా నిలిచిన బుడ్డోడు.. | Times Now Telugu

స్క్రీన్ ప్లేలో ఈ బుడ్డోడు కనిపించినప్పుడల్లా థియేటర్‌ల‌లో ఆడియన్స్ కడుపుబ్బ‌ నవ్వుకునేలా బుడ్డోడి పాత్రను డిజైన్ చేశారు. ముఖ్యంగా గోదావరి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇలా అందరిని నవ్విస్తున్న బుల్లి రాజు.. అలియాస్ రేవంత్ భీమల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే బుల్లి రాజుగా ఈ కుర్రాడికి అనిల్ రావిపూడి అవకాశం ఇవ్వడానికి కారణం ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పార్టీకి ప్రచారం చేసిన వీడియో అని తెలుస్తుంది. చాలామంది లాగే ఈ బుడ్డోడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్.

Sankranthiki Vasthunam Business:సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ బిజినెస్..వెంకటేష్ మూవీ లాభాల్లోకి రావాలంటే | Sankranthiki Vasthunam Pre Business Worldwide: Here is Dil Raju break ...

అలా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో జనసేన తరఫున ప్రచారం చేశాడు. రేవంత్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకోచాడు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌ను మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్.. అసెంబ్లీ ఎన్నికల టైం లో క్యాంప్ పైన కూడా చేశా. అన్ని ఇళ్లకు బ్యాలెట్ పేపర్లు పట్టుకొని ఓట్లు వేయాలని తిరిగా. నేను అలా తిరగడం వీడియోలో రికార్డ్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే.. అది వైరల్ గా మారడంతో అనిల్ రావిపూడి గారు చూసి నన్ను ఆడిషన్స్‌కి పిలిచారంటూ చెప్పుకొచ్చాడు. అలా నేను ఈ సంక్రాంతికి వస్తున్నాను సినిమాలో సెలెక్ట్ అయ్యానని వెల్లడించాడు. సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. రేవంత్ గతంలో జనసేన కూటమి ప్రచారం చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది.