నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు అంత కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ అఫీషియల్ గా ప్రకటించారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నాడు అంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యాన్స్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్స్ కు ఇప్పుడు ఆనందం ఆవిరి అయ్యేటట్టు కనిపిస్తుంది.
మోక్షజ్ఞ ఎంట్రికి స్టార్టింగ్‌లోనే బ్రేక్ పడినట్లు సమాచారం. ఆర్పాటంగా ప్రకటన ఇచ్చి.. లుక్ కూడా రివీల్ చేసిన తర్వాత ముహూర్తం షార్ట్ వచ్చేసరికి సినిమా ఆగిపోయిందని రకరకాల కారణాలు వైరల్ గా మారుతున్నాయి. అది సినిమా తాత్కాలికంగానే ఆగిపోయింది అంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొందరేమో చిన్న మార్పులు, చేర్పులతో మళ్ళీ సినిమా సెట్స్ పైకి వస్తుందంటూ చెబుతున్నారు. కొడుకు ఆరోగ్యం బాలేదంటూ బాలయ్య.. మోక్షజ్ఞ సినిమాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు అంటూ ఎస్ఎల్వీ సినిమాస్ చెప్తున్నా.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ డెబ్యూ ఉండకపోవచ్చు అని చాలామంది అంచనాలు వేస్తున్నారు.
ఇలాంటి క్రమంలో చరణ్‌తో బాలయ్య చేసిన చిట్ చాట్ నెటింట వైరల్‌గా మారుతుంది. పవన్ కళ్యాణ్ కొడుకు ఆకిర డబ్యూ గురించి బాలయ్య అడగగా.. దానిపై చరణ్ రియాక్ట్ అయ్యాడు. ఆ వెంటనే మోక్షజ్ఞ డబ్యూ ఎప్పుడంటూ చరణ్ వాళ్ళను రివర్స్‌లో క్వశ్చన్ చేశాడు. ఈ ప్రశ్నకు బాలయ్య ఫేస్‌లో ఒక్కసారిగా ఫీలింగ్స్ మార్చేశాడు. నవ్వుతూనే అతి త్వరలో అంటూ కవర్ చేసేసాడు. నిజంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఉండి ఉంటే నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడు అనేది అక్కడే వివరంగా చెప్పేవాడు. కానీ.. బాలయ్య సమాధానం చూస్తే మోక్షజ్ఞ డబ్యూ మళ్లీ మొదటికే వచ్చిందని సందేహాలు మొదలయ్యాయి అయితే ఈ వార్తలకు క్లారిటీ రావాలంటే మేకర్స్ రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.