సొట్ట బుగ్గల సుందరి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలాకు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో అప్పటి జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి ఫేమ్‌ను సంపాదించుకుంది. అలాంటి లైలా.. వెంకటేష్, సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకటేష్‌కు మరదలు పాత్రలో కనిపించింది. ఇక ఎగిరే పావురమా సినిమాతో అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
తర్వాత భాషతో సంభందం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకున్న లైలా.. మంచి ఫేమ్ వచ్చిన తర్వాత కారణాలు తెలియవు కానీ.. మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. స్టార్ డైరెక్టర్ నన్ను పొట్టి బట్టలు వేసుకోమని టార్చర్ చేశాడంటూ చెప్పకొచ్చింది. నేను సినిమాల్లో చేసే టైంలో కూడా డైరెక్టర్ తొడలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకోవాలని టార్చర్ పెట్టాడని.. మొదట్లో నేను వేసుకొనని చెప్తే.. ఇప్పటివరకు ట్రెడిషనల్ పాత్రలో చేసావు. ఇలాంటి గ్లామర్ పాత్రల్లో నటిస్తేనే నీకు అవకాశాలు వస్తాయని చెప్పాడని.. నేను అలా వేసుకోవడానికి నిరాకరించా.
కానీ పొట్టి పొట్టి స్కట్స్ వేసుకోమని ఆ డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడు. తప్పక అలా వేసుకొని నటించా. నా పాత్ర బాగా లేకపోవడంతో నువ్వు గ్లామర్ గా కనిపించలేదు.. బొమ్మలా కనిపిస్తున్నావు అని మళ్లీ రివర్స్లో చెప్పేసాడు అంటూ వివరించింది. మీరు చెప్పిందే కదా నేను చేశాను.. అని డైరెక్టర్‌ని అడిగానని.. ఆ డైరెక్టర్ వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగిందంటూ వివరించింది. ఇక లైలా లాగే ఎంతోమంది సీనియర్ సెలబ్రిటీలో సినిమాల్లో చేసే టైంలో డైరెక్టర్స్, నిర్మాతల, హీరోల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు చాలానే విన్నాం. ఇక తాజాగా రీ ఏంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు షోలకు జడ్జిగా.. అలాగే సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది.