టాలీవుడ్ పవర్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడు గానే కాదు.. రాజకీయ నాయకుడిగాను ప్రజల ప్రసంసలు పొందుతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో మంది నిర్మాతలతో చక్కటి అనుబంధం ఉంది. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కూడా ఒకడు. దాదాపు పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలకు ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఆయన చేయబోయే సినిమాలకు కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే రూపొందిస్తుంది.
ఇక పర్సనల్ గాను ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. నిజానికి ఈయన జనసేన పార్టీ నుంచి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నడు. కానీ కూటమిలో భాగంగా ఈ ప్రాంతం బిజెపి నేతలకు వెళ్లడంతో.. కూటమి పార్టికి మద్దతు తెలిపిన టీజీ విశ్వప్రసాద్.. పార్టీ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున అందరికీ పార్టీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే విశ్వప్రసాద్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఆయన కోసం పవన్ కళ్యాణ్ 120 ఎకరాల గిఫ్ట్ గా ఇచ్చారని టాక్. కర్నూల్ లోని ఓర్వకల్లులో కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూమిని టీజీ విశ్వప్రసాద్ కోసం కేటాయించడంతో ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లో నిలిచాడు.
పవన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. మొదటి దశలో 15 సినిమాలు నిర్మించాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. విశ్వ ప్రసాద్ కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఎన్నో బిజినెస్‌లలోను రాణిస్తున్నాడు. ఈ బిజినెస్‌లలో పవన్ భాగస్వామి కావడంతో.. ఆయనకు వేలకోట్ల విలువ చేస్తే భూములను కానుకగా ఇచ్చాడట. ఇప్పుడు ఈ మొబెలిటీ పార్క్‌తో పాటే.. స్కూటర్లు తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుందని.. తైవాన్, చైనా, కొరియా లాంటి దేశాలకు చెందిన కంపెనీలతో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ ఈ రేంజ్‌లో భూములు కానుకగా ఇవ్వడం ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్‌గా మారింది.