గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. ఓ సినిమాలో ముగ్గురు లేదా ఇద్దరు హీరోలు నటిస్తున్నారు అంటే సినిమాలపై క్రెజ్ విపరీతంగా పెరిగిపోతుంది.
ఇలాంటి క్రమంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమాల్లో కూడా బడా స్టార్స్ మల్టీస్టారర్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఏ రేంజ్ లో నటించి ఆకట్టుకున్నారో తెలిసిందే. ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా రికార్డ్ కలెక్షన్లు క్రియేట్ చేసింది. సాధారణంగా ఇద్దరు బడా హీరోలతో సినిమా అంటే అది ఎంతో రిస్కీ ప్రాసెస్. అయిన కథను ఇద్దరితో బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు జక్కన్న. అంతా పెద్ద టాస్క్ ని కూడా సునయాసంగా ప్లే చేసిన రాజమౌళి.. ప్రజెంట్ మహేష్ బాబుతో ప్రెస్టేజియస్ ప్రాజెక్టు రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఇలాంటి క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది. తారక్, చరణ్ కంటే ముందే మరో ఇద్దరు బడా హీరోలతో మల్టీస్టారర్‌ను రాజమౌళి ప్లాన్ చేశాడట. ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు.. చరణ్ అలాగే చిరు. మగధీర సినిమాల్లో చరణ్ అదే విధంగా చిరంజీవి ఇద్దరు క్యారెక్టర్లు హైలైట్ అయ్యేలా భావించాడట. కానీ.. చిరంజీవి అప్పటికే సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడం, రాజకీయాలు వైపు వెళ్లడంతో.. మగధీరలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ని ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఆ క్యారెక్టర్ లేపేసి కేవలం గెస్ట్ క్యారెక్టర్ మాత్రమే మెగాస్టార్ ని రాజమౌళి ఉపయోగించుకున్నారు. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఒకవేళ అప్పుడు కానీ చిరంజీవి ఒప్పుకొని ఉండి ఉంటే.. ఆ సినిమా వేరే లెవెల్ లో ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.