టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే వెంకి మామ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. దీంతో వీరి కాంబోకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ క్యూ కడుతుండడంతో సినిమా 100% అక్యునపెన్సీ కొనసాగుతుంది. అలా మొదటి రోజు నుంచి నిన్నటి వరకు కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న వెంకీ మామ.. ఐదవరోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసాడో ఒకసారి చూద్దాం.
స్టార్ హీరో వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించని ఈ సినిమాలో విట్టిని నరేష్, సాయికుమార్, మురళి గౌడ్, పిటిఎస్ గణేష్, ఉపేంద్ర, లియో తదితరులు కీలక పాత్రలో కనిపించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన సినిమాకు.. బీమ్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇక సినిమా నటీనటులు, ప్రమోషన్ల ఖర్చులతో కలిపి రూ.85 కోట్ల బడ్జెట్ కాగా.. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.42 కోట్ల మీరే జరగడం విశేషం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే మొదటి నాలుగు రోజుల్లో సినిమా రూ.131 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు.
ఇక సంక్రాంతికి వస్తున్నాం ఐదో రోజు కలెక్షన్ల రూ.150 కోట్లు దాటినట్లు సమాచారం. దీంతో వెంకీ మూవీ ఐదు రోజుల్లో రూ.100 కోట్ల షేర్ వసూళ్ళు కొల్లగొట్టినట్లు సినీ వర్గాలు వివరించాయి. ఇక సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజు లాంటి భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ఉండగా.. విక్టరీ వెంకటేష్ చిన్న సినిమాకు ఈ రేంజ్‌లో పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరు ఊహించని రేంజ్‌లో ఈ సినిమాకు యునానిమస్ టాక్ రావడంతో ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా వెంకీ మామ నిలిచాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.