పవన్ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్.. మరోసారి సినిమా వాయిదా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. సమయం దొరకక‌పోవడంతో సినిమాకు సరైన డేట్స్ ఇవ్వలేక సతమతమవుతున్నారు దింతో సినిమా రిలీజ్ అంత‌కంత‌కు ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవల హరిహర వీరమల్లు మూవీకి వరుసగా డేట్స్ ఇచ్చిన పవన్ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే యూనిట్ కూడా మార్చి 28న సినిమాను పార్ట్ 1 రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అనేకసార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా మార్చి 28న సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

Hari Hara Veera Mallu: Part 1 - Wikipedia

తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. షూటింగ్స్ శ‌ర‌వేగంగా జరుగుతుందని.. చెప్పిన డేట్‌కు రిలీజ్ అవుతుందని అంత భావించారు. అయితే తాజాగా మరోసారి సినిమా వాయిదా పడిందంటూ న్యూస్ నెటింట‌ వైరల్ అవడంతో పవన్ ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నాడని తాజాగా ప్రకటించాడు. అలాగే మ్యాడ్ స్క్వేర్‌ సినిమా కూడా మార్చి 29న రిలీజ్ అని మేకర్స్‌ ప్రకటించారు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ దగ్గరగా ఉండడంతో.. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారని.. ఈ కారణంతోనే ఆ సినిమాలను అంత నమ్మకంగా అనౌన్స్ చేశారని టాలీవుడ్ లో టాక్ వైరల్ గా మారుతుంది. పవన్ కి పోటీగా పవన్ వీరాభిమానిగా ఉన్న నితిన్ అయితే కచ్చితంగా సినిమాలో రిలీజ్ చేయడు. నితిన్ అదే డేట్ ను రిలీజ్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ లో మరింత అలజడి రేపుతుంది.

Nithin's Robhinhood and Narne Nithiin's Mad Square set for March  clash-Telangana Today

కచ్చితంగా హరిహర వీరమల్లు వాయిదా పడినట్టే అంటూ అంతా భావిస్తున్నారు. ఈ నేప‌ద్యంలో తాజా డేట్ కూడా వాయిదా పడిందంటే.. ఇంకెప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇటీవల పవన్ ఓ ప్రెస్ మీట్ లో హరిహర వీరమల్లు సినిమా ఇంకా ఏడు రోజుల బ్యాలెన్స్ షూటింగ్ ఉందని వివ‌రించాడు. దానికి డేట్స్ ఎప్పుడు ఇస్తారో.. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఫ్యాన్స్ ఓజి కోసం మ‌రింత‌గా వెయిట్ చేస్తున్నారు. దానికి పవన్ కనీసం మూడు వారాలు డేట్స్ ఇవ్వాల్సి ఉందట. ఇంకా హరిహర వీరమల్లుకే వారం టైం ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఓజీకి డైట్ ఇస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ పోన్ అయింది అంటూ వార్తలు వైరల్ అవ్వడం నిజంగానే ఫ్యాన్స్‌కు బిగ్ బాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో.. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో.. అంటూ ఫ్యాన్స్ తో పాటు ఈ రెండు సినిమాల యూనిట్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.