డాకు మహారాజ్.. బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు కారణం అదేనా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వరుస హిట్స్.. హై వోల్టేజ్ ఫామ్ లో ఉన్న బాలయ్యకు మరింత ప్లస్ అయింది. మరోసారి బిగ్ సక్సెస్ బాలయ్యకు కాయమని రేంజ్‌లో టాక్ నడుస్తుంది. ఇక ఇది రాబోయే అఖండ 2 సినిమాకు కూడా మంచి బూస్టప్ అవుతుంది. కానీ.. డాకు మహారాజ్ రిలీజ్ ప్లానింగ్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాకు అతి తక్కువ థియేటర్స్ రావడం.. గతంలో కంటే కూడా తక్కువగా థియేట‌ర్స్ ఇవ్వడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నైజం ఏరియాలో సరిగ్గా రిలీజ్ చేయలేదని బాలయ్య ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారట.

Daaku Maharaaj Full Movie Collection: 'Daaku Maharaaj' box office  collections day 3: Nandamuri Balakrishna's action flick crosses Rs 60  crores worldwide | - The Times of India

నైజం ఏరియాలో ఈ సినిమాకి థియేటర్లో కేటాయింపులో చాలా అన్యాయం జరిగిందంటూ సమాచారం. సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలు బరిలో ఉండడంతో థియేటర్ కేటాయింపులు ప్రాధాన్యత వహించాయి. కానీ.. డాకు మహారాజ్‌కి నైజంలో కేవలం 180 స్క్రీన్లు మాత్రమే వచ్చాయని.. అదే టైంలో మరో పెద్ద సినిమా 250కి పైగా స్క్రీన్లు కేటాయించినట్లు.. వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం కూడా మళ్లీ థియేటర్ల కౌంటు పెంచుతున్నారని.. నైజం ఏరియాలో ఏషియన్ సురేష్ బాబు ఆధిపత్యం బలంగా ఉండడంతో.. వెంకటేష్ మూవీకి అనుకూలంగా మరిన్ని స్క్రీన్‌లు ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఇక డాకు మహారాజ్‌కి నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దిల్ రాజు గేమ్ ఛేంజర్ త‌న మూవీ కావడంతో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.

డాకు మహారాజ్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్….బాలయ్య ఊరమాస్ జాతర!! | T2BLive

ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు నిరాశపడుతున్నారని.. బాలయ్య సినిమా భగవంత్ కేసరి నైజంలో ఏకంగా రూ.15 కోట్ల వరకు వసూళ్లు కొల్లగట్టగా.. ప్రస్తుతం రిలీజ్ అయిన డాకు మహారాజ్ పొంగల్ బరిలో రిలీజ్ అయిన ఇప్పటివరకు కేవలం రూ.10 కోట్లే దక్కించుకోవడంతో ఈసారి ఓపెనింగ్స్ లోనే గత సినిమా కంటే 30% కలెక్షన్లు పెరగాలసిన క్ర‌మంలో ఓపెనింగ్స్‌లోనే రూ.15 కోట్ల వరకు అవకాశాలు ఉన్నా.. ధియేటర్ కేటాయింపులు లేకపోవడంతోనే ఇలా జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితిల్లో మూవీ టీం నుంచి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నైజంలో సరైన థియేటర్ కేటాయింపులు లభించలేదంటూ.. దీనివ‌ల్ల మూవీపై ప్రభావం పడిందని విశ్లేషకులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.