ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. తమ సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాలతోనూ ఎంతో మంది ఎప్పుడు వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. ఇక హీరోయిన్‌లుగా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న చాలామంది.. పెళ్లికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం పెళ్లి ఆలోచనను రానివ్వకుండా.. లెక్కచేయకుండా లైట్ తీసుకుంటున్నారు. వయసు పెరుగుతున్న పెళ్లి, ప్రేమ అనేది తమ లైఫ్ లో రానివ్వడం లేదు.
అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఒంటరిగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. ఐదు పదుల వయసు మీద పడిన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగా ఉంటూ సోలో లైఫ్ లీడ్ చేస్తున్న హీరోయిన్లలో టబ్బు కూడా ఒకటి. తన వయ్యారాలతో కుర్ర హీరోలతో కూడా షాక్ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో చేసింది అతి తక్కువ సినిమాలైనా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన టబ్బు.. తర్వాత నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండురంగడు లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగుతో పాటు.. బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. ఇక 50 ఏళ్ల వయసు మీదపడినా హాట్ లుక్స్‌తో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో టబ్బు మాట్లాడుతూ.. పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లిపై నాకు ఆసక్తి లేదని.. ఓ మగాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటా అంటూ వివరించింది. సింగిల్ గా లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నా. కెరీర్‌పై ఇప్పటికి దృష్టి పెట్టాలని భావిస్తున్న అంటూ టబ్బు వివరించింది. ప్రస్తుతం టబ్బు చేసిన బోల్డ్ కామెంట్స్ నెటింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.