వావ్: హాలీవుడ్ రేంజ్‌లో తారక్ క్రేజ్.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన నటనతో పాన్‌ ఇండియా లెవెల్‌లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌, చరణ్‌తో కలిసి నటించిన సీన్స్, యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ రేంజ్‌లో ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిందని మరోసారి క్లారిటీ వచ్చింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మరోదర్శకుడు తాజాగా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందంటూ తన కోరికను వెల్లడించాడు.

കടുവയും മാനും ഒരു കൂട്ടിൽ; രാജമൗലിക്കെതിരെ ട്രോൾ | RRR Animal Fight

ఆర్‌ఆర్ఆర్ సినిమా వల్ల ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్‌లో సక్సెస్ సాధించింది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రపంచంలో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను టైగర్ అనే పేరు పెట్టిమరీ ఎంతమంది సినీ స్టార్స్, డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో చాలామంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆర్‌ఆర్ఆర్ సినిమాను వీక్షించారు. తారక్ నటనకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఆయన నటన ఎమోషనల్ కంటెంట్‌లో అయినా పర్ఫామెన్స్‌కు ప్రశంసలు కురిపించారు.

దానికి మరోసారి ప్రూఫ్ బయటకు వచ్చింది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్‌గ‌న్‌ తాజాగా ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తారక్ నటన తెలుగు సినీ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచింది. నాకు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆర్‌ఆర్ఆర్‌లోని ఆయన యాక్షన్స్.. నటన నా దృష్టిని ఆకట్టుకున్నాయి. జంతువులతో దూకే సీన్స్ అద్భుతం అందులో ఆయన నటన‌ను అద్భుతం ఒక గొప్ప ప్రాజెక్టులో ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నా అంటూ డైరెక్టర్ జేమ్స్‌గ‌న్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.