టాలీవుడ్ స్టార్ హీరోస్‌గా దోసుకుపోతున్న చిరంజీవి, బాలకృష్ణ 1980, 90లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రతి ఏడాది సంక్రాంతికి పోటీపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి క్రమంలో ఇద్దరు సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఒక ఏడాది చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరో ఏడాది బాలయ్య సినిమా సక్సెస్ సాధిస్తుంది. అలా చిరంజీవి చాలా రోజులు ఇండస్ట్రీకి దూరమైనా రీయంట్రీ తో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధితో రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే 2001లో సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య పెద్ద పోటీనే నెలకొంది.
జనవరి 11న బాలయ్య నరసింహనాయుడు, చిరంజీవి మృగరాజు రిలీజ్ కాగా.. జనవరి 14న వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా రిలీజ్ అయింది. అయితే మూడు సినిమాల్లో మృగరాజు డిజాస్టర్ గా నిలవగా వెంకటేష్ దేవి పుత్రుడు యావరేజ్ టాక్ సంపాదించుకుంది. బాలయ్య నరసింహుడు మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి బాలయ్య కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. అయితే ఆ ఏడది బాలయ్యకు చాలా అన్యాయమే జరిగిందట. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినా.. అన్యాయం ఏంటి అనుకుంటున్నారా.. ఈ సినిమా రిలీజ్ టై్కు గ్రేటర్‌ఆంధ్ర, హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తంలో కేవలం 14 థియేటర్లను మాత్రమే ఇచ్చారట. ఎక్కువగా మృగరాజు సినిమాకు ప్రిఫరెన్స్ ఇచ్చినా డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ థియేటర్లను మృగరాజుకు.. మిగతావి వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాకు బుక్ చేసేసారట.
తమ అభిమాన హీరో పెద్ద సినిమాకి పెద్ద థియేటర్స్ దక్కలేదని బాలయ్య అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అయితే సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే చిరు సినిమా డిజాస్టర్ కావడం.. బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. అన్ని థియేటర్లలో నరసింహనాయుడు సినిమానే ప్రదర్శించారు. అలా సినిమా 150 నుంచి 200 రోజుల వరకు ఆడి కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. ఎన్నో చోట్ల రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అలా చిరంజీవి సినిమాకు ఇంపార్టెన్స్ ఇచ్చి బాలయ్య సినిమాకు అన్యాయం చేసినా చివరకు బాలయ్య బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసి ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు.