స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఇటీవల డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్‌లో సినిమాలను చంపేయకండంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. థమన్ ఈ ఈవెంట్లో నెగిటివ్ ట్రోల్స్ గురించి రియాక్ట్ అవుతూ.. ఒక సక్సెస్ వచ్చిందని చెప్పాలంటే కూడా నిర్మాతలకు చెప్పబుద్ధి కానీ పరిస్థితి.. అలా చెబితే అతనిపై మళ్లీ ఏదో నెగిటివ్‌గా ట్రోల్స్ చేయడం.. ట్రెండ్ చేయడం మొదలు పెట్టేస్తారు. మీరు చేసే నెగటివ్ ట్రోల్స్ నిర్మాతల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. మన తెలుగు సినిమాను మనమే చంపేసుకుంటుంటే ఏం బతుకు బతుకుతున్నాం అర్థం కావడం లేదంటూ మండిపడ్డాడు.
వపరీతమైన ట్రోల్స్ వల్ల చాలా బాధపడ్డాను అని.. సక్సెస్‌ని ఓపెన్‌గా చెప్పుకోలేకపోతున్నాం అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఇది నిజంగా దురదృష్టకరమని.. మీరు పర్సనల్గా కొట్టండి.. కానీ సినిమాను చంపేయొద్దు అంటూ ఎమోషనల్ అయ్యాడు. థమన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. దీనిపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. థమన్‌ను ట్యాగ్ చేస్తూ.. సినీ పరిశ్రమ మంచిని కోరుతూ థమన్ మాట్లాడిన తీరును ప్రశంసించాడు. డియర్ థమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడే నీలో ఇంత ఆవేదన ఉందని నేనే ఆశ్చర్యపోయా. కానీ.. మనసు ఎంత చెంతిస్తే నువ్వు ఇంతలా రియాక్ట్ అయ్యావు అనిపించిందంటూ చిరు కామెంట్స్ చేశారు.
విషయం సినిమా అయినా.. క్రికెట్ అయినా.. మరి ఏదైనా.. సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల్లో తాలూకా ప్రభావం ఎదుటి వ్యక్తిపై ఎలా ఉంటుందో ఆలోచించాలని.. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, కానీ.. ఒక మాటతో ప్రపంచానికి ఆదర్శంగా నిలవచ్చు.. మాటతో ప్రపంచాన్ని నాశనం చేయవచ్చు.. మీరు ప్రపంచం ఎలా ఉండాలనుకుంటున్నారో చూజ్ చేసుకోండి.. మనం పాజిటివ్ గా ఉంటే ఎనర్జీ మన జీవితాల్లో కూడా ఉంటుందంటూ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్ వైరల్ అవుతుంది. కాగా.. తాజాగా రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్‌కు నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ సినిమాపై నెగెటివిటీ పెంచటమే కారణమని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే థమన్ మాటలతో ఏకీభవిస్తూ చిరంజీవి అల రియాక్ట్ అయ్యారని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
Dear @MusicThaman
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025