టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్గా అనిల్ రావిపూడి తెలుగు ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస సక్సెస్ లతో ఫ్లాప్ తెలియని దర్శకుడుగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఇప్పటికే తన ప్రతి సినిమాపై ఆడియన్స్ లో మంచి హైట్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక సినిమాపై చిన్నప్పటినుంచి అపారమైన పెరిగిన అనిల్ రావిపూడి ఉద్యోగమా.. సినిమానా.. అనే ప్రశ్నకు సినిమానే సమాధానం గా ఎంచుకున్నారు. 2004లో బీటెక్ పూర్తి చేసి 2005లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. తన్నా బాబాయ్ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ సహాయంతో మార్గం కాస్త సులభమైనా.. స్టార్ డైరెక్టర్ గా మాత్రం తన సొంత ప్రతిభతో ఎదిగాడు.
దాదాపు పదేళ్లు డైలాగ్ రైటర్‌గా వ్యవహరించిన ఆయన పటాస్‌తో మెగా ఫాన్ పట్టే అవకాశం వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. 2017 జనవరి 23న రిలీజైన ఈమూవీ నిర్మాతలకు మూడు రెట్లు వసూళ్ళు తెచ్చి పెట్టడంతో.. ఒకసారిగా అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే.. అనిల్ రావిపూడి రూపొందించిన ఎనిమిది సినిమాలలో ఐదు సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందించడం విశేషం. ఇక ఇదే బ్యానర్ పై తాజాగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి అదే క్రేజ్‌తో దూసుకుపోతూ ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటుంది.
కేవలం డైలాగ్ రైటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ రేంజ్ లో అనిల్ సక్సెస్ సాధించడం వెనక అసలు కారణం ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తిరిగి రావాలనే దృష్టితో సినిమాల రూపొందిస్తాడు. దాని కోసం ఆయన ఎంతైనా కష్టపడతారు.. ఇదే అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ అని.. గత సినిమా ఇండస్ట్రీయల్ హీట్ అయినా.. లేటెస్ట్ మూవీ ఫ్లాప్ అయితే డైరెక్టర్ కు అవకాశాలు రావడమే కష్టం అని ఆయన ఆలోచిస్తూ ఉంటారట. ఈ క్రమంలోనే బడ్జెట్ మించి ఆయన ఎప్పుడు సినిమాలను రూపొందించే ప్లాన్ చేయడు. తక్కువ రోజుల్లోనే సినిమాలు రూపొందించి సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా సంక్రాంతికి వస్తున్నాం 72 రోజులు షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. అయితే సినిమా ఏదైనా సెట్స్ పైకి రాకముందే పేపర్ పై కథను ఎడిట్ చేసేసి.. ఎంతవరకు అవసరమో అంతవరకే షూట్ చేస్తాడు. ప్రతి సినిమా రెండున్నర గంటలలోపే నడివి ఉండేలా చూసుకునేందుకు ఇష్టపడతారు.
ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రొడ్యూసర్ శిరీష్.. అనిల్ రావిపూడి ని ఉద్దేశిస్తూ మేము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది ఆనందపడేలోపు సంక్రాంతికి వస్తున్నాంతో.. మమ్మల్ని పక్కకు లాగేసాడు.. అనిల్ లేనిదే మేము లేము అంటూ కామెంట్స్ చేశాడు. అంతే కాదు సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకులకు సినిమాకు ప్రేక్షకులు చేరువ అయ్యేలా వేరే లెవెల్లో ప్రచారాలను ప్లాన్ చేస్తూ ఉంటాడు అనిల్. నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్ లో పాల్గొని నవ్వులు పోయిస్తాడు. ఆ సినిమాపై ఆసక్తి కలిగేలా ప్రమోషన్స్ క్రియేట్ చేస్తాడు. సినిమా ఈవెంట్ లో డ్యాన్స్‌లు కూడా చేసి ఆకట్టుకుంటాడు. అలా ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక అనిల్ తన నెక్స్ట్ సినిమాలు చిరంజీవితో రూపొందించనున్నాడని సమాచారం. ఈ క్రమంగానే ఫ్యాన్స్ అంతా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వేచి చూస్తున్నారు.