టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే మారుమోగిపోతుంది. దానికి కారణం తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కావడమే. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం క్యారెక్టర్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యం రోల్‌లో జీవించేసిందని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనం. వెంకటేష్ భార్యగా తన అందం, అభినయంతో పాటు మాటతీరుతోను 100 పర్సెంట్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటి దక్కించుకుంది.
ఇక వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించింది. ఈమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కాగా సినిమాలో వెంకటేష్ తర్వాత ఐశ్వర్య రాజేష్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సౌందర్య గారి తర్వాత వెంకటేష్ పక్కన అంతలా పర్ఫామెన్స్ చేస్తూ ఆకట్టుకున్న హీరోయిన్ ఐశ్వర్య అంటూ.. రాబోయే రోజుల్లో ఐశ్వర్య ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోవడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమ్మడి ఖాతాలో బడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో చరణ్ మరో సినిమాలో నటించనున్నాడు.
ఈ సినిమాలో మొదట సమంత హీరోయిన్ గా భావించాడట సుక్కు. అయితే.. సమంత టాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ క్రమంలోనే నాచురల్ లుక్‌తో ప్రస్తుతం ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ అయితే.. చరణ్ పక్కన బాగుంటుందని ఉద్దేశంతో ఆమెను ఫిక్స్ చేశాడట సుక్కు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారడంతె ఇదే నిజమైతే మాత్రం అమ్మడి కెరీర్ పెద్ద మలుపు తిరరుగుతుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాజెక్టులను ఎంచుకుంటుందో.. ఏ రేంజ్‌లో తన నటనతో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.