” సంక్రాంతికి వస్తున్నాం ” కలెక్షన్ల ప్రభంజనం.. నాలుగవ రోజు ఎన్ని కోట్లంటే.. ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్‌ షో నుంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగాను దుమ్ము దులుపుతుంది. అలా మొదటి రోజే ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిన ఈ మూవీ ఇప్ప‌టికి అదే రేంజ్‌లో క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొడుతూ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. అలా తాజాగా ఈ సినిమా నాలుగ‌వ రోజు క‌లెక్ష‌న్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు మేక‌ర్స‌.

Sankranthiki Vasthunam Box Office Collection Day 3 Early Updates (Today):  Venkatesh Crime Comedy Crosses Rs 50 Cr; Smashes Game Changer |  Sankranthiki Vasthunam Third Day Collection Early Trends (16 January 2025) |

ఒకసారి ఆ కలెక్షన్ల లెక్క‌లేంటో చూద్దాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు వీకే నరేష్, వీటిని గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ కీలకపాత్రలో క‌నిపించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.ఇక సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌టి నుంచే జోరుగా సాగ‌డంతో సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.42 కోట్లమేర జ‌రుపుకుంది. కాగా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.85 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్ల‌డించాయి. 1300 స్క్రీన్ లలో ప్రసారమైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఫ‌స్ట్ డేనే రూ.45 కోట్ల ఓపెనింగ్స్‌ను రాబట్టింది.

వెంకీ మామ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల‌గొట్టిన‌ సినిమాగా సంచలనం సృష్టించింది. పండగ పూట ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన విందు అందించింది. ఇక‌ రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజులకు కలిపి రూ.77 కోట్ల వరకు గ్రాస్ సాధించగా మూడో రోజుకు 106 గ్రాస్ క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొట్టింది. ఇక ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్న ఈ సినిమా.. 4వ‌ రోజు రూ.131 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టినట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. ఇక నేడు, రేపు వీకెండ్స్ కావడంతో సినిమాల వసూలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.