ఒక్క సక్సెస్ తో మూలాలు మర్చిపోతే వాళ్లు చెత్తతో సమానం.. వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ గురించేనా..?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా అసలు టైం కలిసి రావడం లేదు. ఇటీవల వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈనెల 14న మట్కా అనే పీరియాడికల్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ నటించిన సినిమాలు అన్నింటికంటే ఇది చాలా బెటర్ గా ఉంటుందని.. ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈవెంట్ కు వరుణ్ తేజ్.. తన భార్య లావణ్య త్రిపాఠి తో హాజరై సందడి చేశాడు.

వేదికపై వరుణ్ మాట్లాడుతూ.. మా సినిమా హీరోయిన్ వేరే షూటింగ్లో ఉండి ఈరోజు రాలేకపోయింది. ఈ సినిమా హీరోయిన్ రాకపోయినా.. నా రియల్ లైఫ్ హీరోయిన్ వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. తను వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని.. నాకు ప్రతి విషయంలో లావణ్య సపోర్ట్ గా నిలుస్తున్నందుకు లవ్ యు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ లోనే వరుణ్ తేజ్ బన్నీపై పరోక్షంగా చేసిన హాట్ కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి. వరుణ్ మాట్లాడుతూ నా ప్రతి సినిమా పూర్తి అయిన తర్వాత నాలో ఒక చిన్న భయం.. కష్టపడి సినిమా చేశా ఆడియన్స్ కు నచ్చుతుందో.. లేదో అని టెన్షన్.. నాకు కచ్చితంగా ఉంటుంది. మట్క సినిమా బాగా వచ్చినా.. ఇప్పుడు కూడా నాలో ఆ టెన్షన్ ఉంది. సరిగ్గా ఆ టైంలో చరణ్ అన్నయ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

Matka will be a sure shot blockbuster: Varun Tej | Matka will be a sure  shot blockbuster: Varun Tej

అప్పటివరకు ఉన్న టెన్షన్ మొత్తం పోయిందని.. చరణ్ అన్న నాకు ధైర్యం చెప్పక్కర్లేదు కేవలం నా పక్కన ఆయన నిలుచుంటే అది ధైర్యం అంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు. చిరు గారు, పవన్ గారు ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటారంటూ వివరించాడు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా చిరు, పవన్ పేర్లు చెప్పుకుంటూ ఉంటాడని నన్ను చాలామంది అంటారు. నాకు జీవితం ఇచ్చిందే వాళ్ళు.. వాళ్ళ గురించి తప్పకుండా చెప్తా. నీకు రేపు ఎంత పెద్ద సక్సెస్ వచ్చి.. వారిని మర్చిపోతే ఎన్ని విజయాలు సాధించిన వేస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుణ్ చేసిన కామెంట్స్ ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ‌ వైరల్ చేస్తున్నారు. పైగా వరుణ్ మాట్లాడేటప్పుడు చరణ్, చిరు, పవన్ గురించి మాట్లాడుతూ వారే నాకు ముఖ్యం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ.. అల్లు అర్జున్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీన్ని బట్టి ఇన్‌ డైరెక్ట్‌గా అల్లు అర్జున్ ని అన్నాడంటూ పలువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.