దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ టాలీవుడ్‌లో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు సినిమాలపై ఉన్న ఆశక్తి.. డైరెక్షన్‌లో ఆయన విజన్ చూస్తేనే అర్థమవుతుంది. తను తెరకెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న జక్న ఒక ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్ దర్శకుల ప్రశంసాలను కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభంజనం సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడని.. ఇంకా సినిమా సెట్స్ పైకి రాకముందే కొన్ని లొకేషన్స్ లను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడని.. ఏది ఏమైనా మహేష్, జక్కన్న కాంబోలో రాబోతున్న ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం అంటూ మహేష్ కెరీర్‌లోనే బిగ్ సక్సెస్ అందుకోవడంలో సందేహం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలను విలన్గా తీసుకుంటున్నాడట జక్కన్న. మలయాళ ఇండస్ట్రీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ్ నుంచి శివ కార్తికేయన్, బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం లను ఈ సినిమాలో విలన్‌లుగా చూపించబోతున్నాడని సమాచారం.
నిజంగా వీళ్ళ ముగ్గురు ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తే మాత్రం ఇండియాలో కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు, హాలీవుడ్ పరంగా పెద్దగా మేకర్స్‌ను తీసుకోకపోయినా కంటెంట్ పరంగా హాలీవుడ్ రేంజ్ లో ఆడియన్స్‌ను సినిమా ఆకట్టుకుంటుందని ఉద్దేశంతోనే.. సినిమాలో ఇండియాలోనే టాప్ స్టార్‌గా ఉన్న కొందరిని సెలెక్ట్ చేసుకుంటున్నాడట. ఏది ఏమైనా జక్కన్న తనదైన స్టైల్ లో ఓ సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమా సక్సెస్ సాధించకపోవడం అనేది ఇప్పటివరకు ఆయన హిస్టరీలో లేదు. ఇక ఫ్యూచర్‌లో మహేష్ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.