అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభితతో రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. గతంలో స్టార్ థియేటర్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్న చైతూ ఏవో కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి శోభితతో ప్రేమలో పడిన చైతు.. చాలా కాలం సెక్రట్ డేటింగ్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా.. అవన్నీ రూమర్లు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కొట్టిపడేశారు. అయితే ఈ ఏడది ఆగస్టు 8న ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు సడన్ షాక్ ఇచ్చారు చైతు – శోభిత. నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన ఈవెంట్ పిక్స్ స్వయంగా నాగార్జున అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
ఇక ఈ జంట ఏడది డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకొని ఒకటి కానున్నారని సమాచారం. శోభిత ఇటీవల పసుపు దంచుతున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో అవి తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే అన్నపూర్ణ స్టూడియోస్ 22 ఎకరాల సెట్టింగ్ వేసి సందడి చేస్తున్నారు. ఇది వీరి వివాహానికి సంబంధించిన సెట్స్ అని సమాచారం. ఇక శోభిత విషయానికి వస్తే ఈమె గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించింది. తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి సెటిల్ అయ్యారు. కాగా పేరుకు తెలుగు అమ్మాయి అయినా.. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో శోభిత మొదట నటించే అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం అటు హాలీవుడ్, బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల్లోను మెరిసింది.
అయితే శోభిత.. నాగచైతన్యకు కట్నం కింద ఎన్ని కోట్లు ఇస్తుందని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చైతుకు.. శోభిత అసలు ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వడం లేదట. తన దగ్గర ఉన్న బంగారం మాత్రమే తనతో పాటు తెచ్చుకుంటుందని.. డబ్బులు, ఇళ్లస్థలాలు మా కొడుకుకు అవసరం లేదు.. జీవితాంతం తనతో తోడు ఉండి జాగ్రత్తగా చూసుకుంటే చాలు అంటూ శోభిత తల్లిదండ్రులతో నాగార్జున చెప్పేసాడట. మంచి ఇల్లాలిగా ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి. ఇక సంపద అంటారా మాకు ఇప్పటికే తరగని ఆస్తి ఉంది. కట్నంతో మాకు అవసరం ఉండదు అంటూ వివరించారట. ఇక నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత పాపులారిటీ మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే.