నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌లోను ఎన్నో ఢౌన్ ఫాల్స్ ఉన్నాయి. అలా 2004 నుంచి 2009 వరకు ఆయన బ్యాడ్ పిరియడ్ ఎదుర్కొన్నారు. దాదాపు ఆరేళ్లలో వరుసగా ఏడు సినిమాల డిజాస్టర్ లను ఎదుర్కోవడంతో ఆయన మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక బాలయ్య ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎలాంటి సినిమా చేసిన వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య కూడా ఆలోచనలో పడ్డారట. అయితే అలాంటి టైం లో మాస్ డైరెక్టర్ బోయపాటి బాలయ్యతో సినిమా చేయాలని అనుకున్నడట. ఇక అప్పటికే బోయపాటి.. భద్రా, తులసి రెండు సినిమాలుతీసి మంచి సక్సెస్లు అందుకున్నాడు.
కానీ.. బాలయ్య మాత్రం ఆ సమయంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేకుండా పోయిందట. బోయపాటి కంటే ఎక్కువగా హిట్లు ఇచ్చిన దర్శకులు వరుసగా 7 ఫ్లాప్లు ఇచ్చి ముంచేశారు. ఈ క్రమంలోనే బోయపాటికి.. బాలయ్యను ఒప్పించడానికి చాలా కష్టమైందట. ఈ విషయాలను స్వయంగా బోయపాటి ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చాడు. డైలాగ్లు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి.. బాలయ్య పాత్ర, బాడీ లాంగ్వేజ్ గురించి క్లియర్గా చెప్పుకోవచ్చా.. ఆయనకు నేను చెప్పిన కథ విధానం, కాన్ఫిడెన్స్ నచ్చాయి. కానీ.. ఇంకా నమ్మకం కుదరలేదు అంటూ వివరించాడు. నేను గతంలోనే బాలయ్య సినిమాలుకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించ. ఈ క్రమంలోనే ఆయన నన్ను అమ్మ శీను అంటూ పిలిచేవారు. అమ్మ శ్రీను నువ్వు కదా చాలా బాగా చెప్పావు. ఎలా తీస్తావో కూడా కాన్ఫిడెంట్గా వివరించావు. అయితే గతంలో నీ కంటే పెద్ద దర్శకులు కథను చెప్పి నన్ను ముంచేశారు.
వాళ్ళు చెప్పిన దానికి.. సినిమా తీసేదానికి అసలు పొంతనే లేకుండా పోయింది. కొన్ని సినిమాలు రెండో రోజుకే పడిపోయాయి. నిన్ను ఎలా నమ్మాలి అని బాలయ్య ప్రశ్నించాడట. దానికి బోయపాటి రియాక్ట్ అవుతూ.. బాబు గారు ఇది నాకు లైఫ్ అండ్ డెత్ మూవీ. మీకు ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా ఉంటుంది. నేను మాత్రం ఇండస్ట్రీ నుంచి సర్దుకోవాల్సిందే. ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటివరకు అంతమందిని నమ్మారు. ఈ సినిమా కూడా పోతే పోయిందనుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ కోసం కాదు.. నాకోసం సినిమా చేయండి.. ఈ సినిమాని హిట్ చేసుకుంటా అని బాలయ్యకు వివరించాడట. ఆ విధంగా సింహా సినిమాలో బాలయ్య నటించారు. అయితే బాలయ్య ప్లాపులను బ్రేక్ చేస్తూ సింహ సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత వీరిద్దరి కాంబో ఎంత క్రేజీ కాంబోగా మారిందో అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన లెజెండ్, అఖండ అంతకుమించి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.