ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న పవన్ రీసెంట్‌గానే తను కమిటైన సినిమాలను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ నెలాకరున హరిహర వీరమల్లు ప్రారంభించిన ఈయన ఈ నెలాఖరుతో షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 28న పాన్ ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టిన రోజే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నిర్మాత ఎం.ఎం.రత్నం ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు భోగి సినిమా వస్తుందంటూ తాజా న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.
ఫిలిం వర్గాలలో ఈ న్యూస్ తెగ వినిపిస్తోంది. మార్చ్ 27న ఓజీని రిలీజ్ చేసేందుకు డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నాడట. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయిన గ్రాఫిక్స్ వర్క్ కావడానికి చాలా టైం పడుతుంది. ఈ క్రమంలోనే దానయ్య.. పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా కలిశారని వీరమల్లును వెనక్కి జరిపి ఓజిని ముందు రిలీజ్ చేయడానికి అనుమతి అడిగారట. అభిమానులు కూడా హరిహర విరమల్లు కంటే సినిమా మీదనే ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమా ప్రెసెంట్ ఉన్న యూత్‌కు బాగా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలో ఓజి సినిమానే ముందు రిలీజ్ చేయాలంటూ ఒత్తులు కూడా ఎదురవుతున్నాయట.
ఇదంతా పక్కన పెడితే వీరమల్లు కంటే ముందు రోజు మూవీ ఫ్రీ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు భరిస్తున్నాయని.. కేవలం కోస్తా ఆంధ్రాలో రూ.70 కోట్లకు రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. అలాగే నైజాంలో రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.16 కోట్లు, సీడెడ్ లో రూ.28 కోట్లకు ఓజీ హక్కులు అమ్ముడు పోయేటట్టు మొత్తంగా పాన్ ఇండియాలో రూ.180 కోట్లకు ఓజి హక్కులను అమ్ముడు పోయే అవకాశం ఉందని టాక్. ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది. కనుక మొదట ఓజీని రిలీజ్ చేయాలని బయ్యర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారట. మరి వీరమల్లు ముందు వస్తాడా.. లేదా గ్యాంగ్ స్టార్ ఎంట్రీ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేస్తాడు క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాలి.