పెళ్లి పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. చేసుకోవాలా..?వద్దా..?అంటూ..

ప్రభాస్ లైనప్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ రాజు రేంజ్ అంటూ.. రెబల్ స్టార్ స్టామినా అంటూ తెగ సంబరపడిపోతున్నారు. సలార్‌తో దాదాపు ఆరేళ్ల తర్వాత సక్సెస్ ట్రాక్‌లోకి ఎంట్రీ ఇచ్చిన్న ప్రభాస్ కల్కి తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయింది. ఏకంగా రూ.1000 కోట్లు పైగా వసూళ్ళు కొల్లగొట్టింది. ఇప్పుడు రాజా సాబ్‌తో ప్రభాస్ మరోసారి ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. మారుతీ దర్శకత్వంలో సినిమా షూట్ ప్రస్తుతం సరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత మరో 6 సినిమాల‌ లైనప్లో బిజీ గా గ‌డుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే మరో మూడు ఏళ్ల వరకు ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు.

Naa Uchvasam Kavanam | Rebel Star "Prabhas" | Part - 1 | Full Episode |  27th October 2024 | ETV

దీంతో ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో ఉంటుందా.. లేదా.. అనే సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి. ప్రభాస్ పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌ను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు భీమ‌వ‌రం అమ్మాయి, రాజకీయ నాయకుడు మనవరాలు అంటూ మరిన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కాగా తాజాగా ప్రభాస్ ప్రముఖ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి జ్ఞాపకార్థంగా నిర్వహించిన.. నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమంలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ETV Win on X: "Watch నా ఉచ్ఛ్వాసం కవనం with #Prabhas Streaming now on  @etvwin https://t.co/ODZmAlyiBr" / X

ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మనీ మూవీలో భద్రం బి కేర్ఫుల్ బ్రదర్ అంటూ సీతారామశాస్త్రి గారు పాట రాశారు. అందులో పెళ్లి చేసుకోవద్దన్నట్లుగా వివరించారు. పెళ్లి డేంజర్ అంటూ రాశారు. తర్వాత పెళ్లి గొప్పదనాన్ని చెప్పే ఎన్నో పాటలు మళ్లీ ఆయనే రాశారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.. చేసుకోకూడదా.. అంటూ నవ్వుతూ ప్రభాస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై నెటిజ‌న్స్‌ రియాక్ట్ అవుతూ.. డార్లింగ్ నీ పెళ్లి కోసం వెయిటింగ్ అంటూ.. అన్నా త్వరగా పెళ్లి చేసుకో అన్న అంటూ.. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.