స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ లో ఎలాంటి సినిమాలు నటించకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక తాజాగా సిటాడెల్.. హనీ బన్నీ బాలీవుడ్ సీరీస్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సమంత.. ఈ సిరీస్ కోసం.. ఎన్నో ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వీరితో పని చేయడం టార్చర్ అని.. వీళ్ళ కాంబోలో తెరకెక్కిన తొలి ప్రాజెక్ట్.. ది ఫ్యామిలీ మెన్ 2 షూట్ రోజులను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ షూట్లో తాను బాగా ఏడ్చేశానంటూ వెల్లడించింది. రాజ్ అండ్ డీకేతో కలిసి చేయడంతో పోలిస్తే.. తెలుగు, తమిళ్ సినిమాల్లో పనిచేయడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని.. సాధారణంగా అక్కడ సినిమాలలో ఒక రోజులో రెండు లేదా మూడు సన్నివేశాలను షూట్ చేసేవారు. ఇక్కడ అలా కాదు.. ఒక గంటలోనే ఆ సీన్స్ అన్నీ షూట్ పూర్తి చేసేస్తారు. ఇక ఈ సిరీస్‌లో రాజీ రోల్‌లో నేను నటిస్తున్న టైం లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్ సీన్స్ అన్ని ఫస్ట్ షెడ్యూల్ లోనే పూర్తి చేసేశారు. ఇక ఈ షూట్ టైంలో రెండు రోజుల తర్వాత మేనేజర్‌కు ఫోన్ చేసి.. నా వల్ల కావడం లేదు. ఇంటికి వచ్చేస్తానని చెప్పేశా. రాను.. రాను.. వాళ్ళ వర్కింగ్ స్టైల్ కు మెల్లమెల్లగా అలవాటు పడ్డ అంటూ సమంత చెప్పుకొచ్చింది. హనీ బన్నీ.. కోసం మరోసారి వీళ్ళతో కలిసి వర్క్ చేయడం నాకు బాగా నచ్చింది అంటూ సమంత వివరించింది.
ఇదే ఇంటర్వ్యూలో రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 టైంలో సమంత ఎన్నో రకాల ఎమోషన్స్ తో స్ట్రగుల్ అవుతున్నారని మాకు తెలియదు. చెన్నైలో రెండు రోజులు షూట్ పూర్తి అయిన వెంటనే మా దగ్గరికి వచ్చేసి షూట్ పూర్తయిందా అని అడిగింది. మేము అయిపోయింది అని చెప్పాం. వెంటనే తన చిన్న పిల్లల ఏడ్చేసింది. ఏం జరుగుతుందో మాకు అసలు అర్థం కాలేదు.. మేమిద్దరం ఒకరి మొకలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయాం.. ఆమెను బాగా కష్టపడుతున్నామని మాకు అర్థమైంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సిరీస్‌లో సమంత రోల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అలా.. తాజాగా వీరి కాంబోలోనే సిటాడెల్.. హాని బన్ని రిలీజ్ అయింది. ఈ స్పై యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.