రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబఃతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాలను లైన్‌లో పెట్టుకున్న డార్లింగ్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ను కలిగి ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచర్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలో ప్రభాస్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన సాంగ్ గురించి చెప్పుకొచ్చాడు. తన ఫేవరెట్ సాంగ్ తన సినిమాలోదే కాదని.. పవన్ కళ్యాణ్ జల్సా మూవీ లో సాంగ్ అంటూ వివరించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి చర్చించుకుంటున్న ఓ షోలో.. ప్రభాస్ జల్సా సినిమాలో ఆయన రాసిన పాట గురించి మాట్లాడారు. తాళ్లపాక అన్నమాచార్యులు రాసిన సంకీర్తనల్లో బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మం ఒకటే.. ఎంత పాపులర్ అందరికి తెలుసు. మనుషులంతా ఒక్కటే అనేలా ఈ సాంగ్ ఉంటుంది.
అదే తరహాలో జల్సా సినిమాలో సిరివెన్నెల.. ఛలోరే ఛలోరే ఛల్ అనే సాంగ్ రాశారు. అది నా ఎవర్ గ్రీన్ ఫేవరెట్. యూత్ కి నచ్చేలా సాంగ్ డిజైన్ చేస్తూనే ఎంతో మీనింగ్ ఫుల్ గా పాటను రాశారు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఆ సాంగ్ నాకు ఎంత ఇష్టమో చెప్పలేను.. ఫ్రెండ్స్ తో ఉన్న, పార్టీ చేసుకుంటున్నా కచ్చితంగా ఈ సాంగ్ ఉండాల్సిందే. ఈ సాంగ్ మీనింగ్ కూడా వాళ్ళకి చెప్తూ ఫ్రెండ్స్ ని తెగ విసిగించేస్తా అంటూ ప్రభాస్ చెప్పకొచ్చాడు. ఇక ఈ సాంగ్ పాడేటప్పుడు వామ్మో మళ్లీ స్టార్ట్ చేశాడు రోయ్ అంటూ నా ఫ్రెండ్స్ పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.