టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సౌత్ ఇండియానే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఆడియన్ అటెన్షన్ అంతా ఆ సినిమా పైనే ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. ఇక జక్కన్న నుంచి ఓ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ప్రేక్షకులంతా ఆ సినిమాను చూడడానికి ఆరాట పడిపోతూ ఉంటారు.
అమితమైన ఇష్టంతో ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలని చాలామంది హీరోలు కూడా పోటీ పడతారు. అయితే గతంలో రాజమౌళి రజనీకాంత్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉండగా.. అది మిస్ అయిందట. రజనీకాంత్ శివాజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత జక్కన్న రజినీని కలిసి ఒక కథ వినిపించారట. ఆ కథ కూడా సెట్ అయింది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న క్రమంలో.. శంకర్ రోబో సినిమా స్టోరీ చెప్పడం.. ఆ స్టోరీ నచ్చడంతో రజిని రోబో కోసం అటువైపు వెళ్ళిపోయాడట. అలా రజనీకాంత్ కాంబినేషన్లో రాజమౌళి సినిమా వర్కౌట్ కాలేదని తెలుస్తుంది.
ఏదేమైనా వీరిద్దరు కాంబోలో సినిమా వచ్చి ఉంటే మాత్రం అది ఏ రేంజ్ లో సక్సెస్ అందుకునేదో అంచనాలు కూడా అందవు. ఇప్పటికి ఈ ఇద్దరు కాంబోలో సినిమా వస్తే కచ్చితంగా ఇండస్ట్రియల్ హిట్ కొడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న యాక్టింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే దర్శకుడు రాజమౌళి.. సినిమా విజన్ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి గొప్ప నటుడు రాజమౌళితో సినిమా ఛాన్స్ వచ్చిన వదులుకోవడం నిజంగానే చాలా బాడ్ లక్ అంటూ.. రజనీ అనవసరంగా ఆ సినిమాను వదిలి తప్పు చేశారంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు నటిజన్స్.