ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్ తమ గ్లామర్ ను మరింతగా పెంచుకోవడానికి రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. మరింత అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. గ్లోబల్ హీరోయిన్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకునే వారు కూడా దీనికి అతీతమేమి కాదు. ఇక హీరోయిన్గా అవకాశాల కోసం చిన్న వయసులోనే అందంగా కనిపించాలని స్టారాయిడ్లు, హార్మోన్ ఇంజక్షన్లు తీసుకున్నారంటూ కూడా చాలామంది పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. అలా స్టెరైట్స్ తీసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకున్న హీరోయిన్లలో సీనియర్ బ్యూటీ దీప పేరు కూడా వినిపిస్తుంది. ఈ కేరళ సోయగం అసలు పేరు మేరీ.. కాగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత దీపగా పేరును మార్చుకుంది.
70, 80లలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ తో కూడా నటించి ఆకట్టుకుంది. మురళీమోహన్‌తో కలిసి.. ఖైదీ నెంబర్ 77, దశ తిరిగింది లాంటి సినిమాల్లో మెప్పించింది. మురళీమోహన్, దీప ఇద్దరు ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు కూడా తెగ వైరల్ అయ్యేవి. దీప అందానికి మురళీమోహన్ పెద్ద అభిమానట. కానీ.. రిలేషన్ గురించి చాలా సందర్భాల్లో ఈయన క్లారిటీ ఇచ్చారు. నేను, దీప ఎక్కువ సినిమాలో నటించాం. కానీ.. నేను ఎప్పుడూ ఆమెను ప్రేమించలేదు. అదృష్టితో కూడా చూడలేదు. శ్రీదేవి అంతటి అందగత్తె ఆమె.. కెమెరామెన్ ఏ యాంగిల్ లో ఆమెను చూపించిన అందంగానే ఉండేది. ఎలాంటి కెమెరాలు కూడా పాడు చేయాలని అందం తనది అంటూ వివరాంచాడు.
చిన్నతనంలోనే దీపా హీరోయిన్ గా మారిందని.. అయితే తన అందం మరింతగా పెరగడానికి స్వయంగా దీప తల్లి తనకు టెరైడ్స్ ఇచ్చింది అంటూ చాలామంది చెబుతుంటారు. ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది అంటూ మురళీమోహన్ వెల్లడించాడు. కారణంగా ఆమె బాగా లావై సినిమా అవకాశాలు తగ్గిపోయట. ఇక దీపతో తాను ఎప్పుడు ప్రేమలో పడలేదని.. ప్రేమ వ్యవహారాలకు నేను దూరంగా ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీప అప్పట్లో ట్రెడిషనల్ గానే కాదు.. బోల్డ్ గాను ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామర్ ప్రదర్శిస్తూ కుర్రకారులు కవించింది. మలయాళీ సినిమాల్లో అప్పట్లో లిప్ లాక్ సీనులోను ఈమె నటించి ఆకట్టుకుంది.