ఆర్‌కే న‌గ‌ర్‌లో గెలుపు వారిదే..

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్కే న‌గ‌ర్‌లో గెలుపు కోసం డ‌బ్బులు విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుచేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు! అటు అన్నాడీఎంకే, ఇటు దీప వ‌ర్గం, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, డీఎంకే, బీజేపీ, ఇలా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇక్క‌డ గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిని వ‌రించ‌బోతోందనే అంశంపై నిర్వ‌హించిన స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో డీఎంకే విజ‌యం […]

ఆర్కె.నగర్ లో ఎవరు గెలిచినా సంచలనమే…!

త‌మిళ‌నాడులో ఆర్కే.న‌గ‌ర్ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక త‌మిళ‌నాడు రాజ‌కీయ చ‌రిత్ర‌ను మార్చ‌బోతుందా ? అస‌లు ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది పెద్ద టెన్ష‌న్‌…టెన్ష‌న్‌గా ఉంది. దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఇక్కడ నుంచి పోటీ విషయంలో తమిళనాడురాజకీయ వర్గాలు చాలా ఉత్సాహంతో రంగంలోకి దిగాయి. జ‌య‌ల‌లిత మేన‌కోడులు దీప సైతం పోటీ చేస్తుండ‌డంతో ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. […]

త‌మిళ‌నాట షాక్‌:  దీప ఓ పార్టీ, దీప భ‌ర్త మ‌రో పార్టీ

త‌మిళ‌నాట మ‌రో సంచ‌ల‌నం! దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌మాధి.. ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఊహించ‌ని ప‌రిణామాల‌తో రోజుకో మలుపు తిరుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో స‌రికొత్త ట్విస్ట్‌! అమ్మ వార‌సురాలిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె మేన‌కోడ‌లు దీపకు అనుకోని వ్య‌క్తి నుంచి అనూహ్యంగా షాక్ ఎదురైంది. దీప ఇంట్లోనే రెండు పార్టీలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇప్ప‌టికే దీప ఒక పార్టీని ఏర్పాటుచేయ‌గా.. ఇప్పుడు ఆమె భ‌ర్త కూడా సొంతంగా ఒక పార్టీని స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి క‌ల‌క‌లం […]

తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత పాలిటిక్స్ ఎంత వేగంగా మారిపోయాయో తెలిసిందే. ముఖ్యంగా సీఎం సీటు కోసం ఇటు చిన్న‌మ్మ‌.. అటు అమ్మ ఆత్మ‌బంధువు ప‌న్నీర్ సెల్వంల మ‌ధ్య జ‌రిగిన‌ చేప‌ల మార్కెట్ ర‌గ‌డ దేశం మొత్తాన్ని ఉత్కంఠ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత చిన్న‌మ్మ జైలుకెళ్ల‌డం.. ప‌ళ‌ని స్వామి సీఎం కావ‌డం ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే… అంత‌టితో పాలిటిక్స్ చ‌ల్లార‌లేదు. త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే వారిలో మ‌రోప‌క్క ప‌న్నీర్ ర‌గ‌డ సృష్టిస్తూనే ఉన్నారు. ఇది […]

త‌మిళ‌నాట‌.. మ‌రో పొలిటిక‌ల్ వార్‌! దీప వ‌ర్సెస్ దీప‌క్‌

సుప్రీం తీర్పుతో త‌మిళ‌నాడు రాజ‌కీయం కొత్త మ‌లుపు తిరిగింది! ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం సీటు కోసం ఆరాట ప‌డ్డ శ‌శిక‌ళ ఇప్పుడు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో సీఎం సీటులో ఎవ‌రు కూర్చుంటారు? ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుందా? శ‌శి త‌దుప‌రి వ్యూహం ఏమిటి? అంద‌రి ఆలోచ‌న‌లూ ఇవే. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌గా ప‌రిచ‌యం లేని ఇద్ద‌రు తెర‌మీద‌కి వ‌చ్చారు. తామే దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు అస‌లు సిస‌లు వార‌సుల‌మ‌ని […]

శ‌శిక‌ళ‌కు ముందుంది ముస‌ళ్ల పండ‌గ

త‌మిళ‌నాట రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. పార్టీప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇక రేపో మాపో సీఎం పీఠంపై కూర్చోవాల‌ని చూస్తున్న శ‌శిక‌ళ‌కు.. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తే `అధికార […]

త‌మిళ సీఎం దీపానే…! శ‌శిక‌ళ‌కు షాకే

`అమ్మ‌`ను కోల్పోయిన త‌మిళ‌వాసుల‌కు స‌రికొత్త ఆశా`దీపం` దొరికింది. త‌మిళ రాజ‌కీయాల‌ను శాశించాల‌ని కోరుకుంటున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు దీప రూపంలో ఊహించ‌ని షాక్ ఎదురైంది. జ‌య అన్న కూతురు దీపకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెపై రోజురోజుకూ ఒత్తిడి అధిక‌మ‌వుతోంది. చెన్నై టీనగర్‌లోని ఆమె ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వ‌చ్చి.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెను బ‌తిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన `చిన్న‌మ్మ‌` […]