సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తాజాగా సమంత నుంచి సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజై ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమ్మడు హీరోకు దీటుగా యాక్షన్ సన్నివేశాలలో నటించి మెప్పించింది. అంతేకాదు.. మరో పక్క బోల్డ్‌గా లిప్ లాక్ సన్నివేశాలను రెచ్చిపోయింది. కాగా తాజాగా సమంత ఈ వెబ్ సిరీస్ లో తన తల్లి పాత్ర గురించి మాట్లాడుతూ రియల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. సమంత మాట్లాడుతూ తన మనసులో కోరిక బయటపెట్టింది.
నాకు తల్లి కావాలని కలలు ఉన్నాయి.. అమ్మగా ఉండడానికి నేను చాలా ఇష్టపడతా అంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనికి ఆలస్యమైందని కూడా నేను అనుకోవట్లేదు.. ప్రస్తుతం నా లైఫ్ చాలా సంతోషంగా గడుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక తల్లి కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే.. ఈ క్రమంలోనే సమంతా రెండో పెళ్లికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడి లైఫ్ లోకి నెక్స్ట్ సినీ రంగానికి చెందిన వ్యక్తి వస్తాడా.. లేదా బయట వ్యక్తులను వివాహం చేసుకుంటుందో వేచి చూడాలి. అలాగే ఈ వెబ్ సిరీస్లో తన కూతురుగా నటించిన కాశ్మీ మజ్ముంధర్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించిన శ్యామ్.. తను చాలా తెలివైన అమ్మాయి.. అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ పండిస్తుందంటూ చెప్పుకొచ్చింది.
ఇక స్పై యాక్షన్ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డికే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 7న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్.. ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ సెటాడెల్‌కు ఫ్రీక్వెల్ గా రూపొందింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా హనీ – బన్నీ గా సామ్ – వరుణ్ కనిపిస్తారు. వారి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇందులో సమంతా టైటిల్ రోల్ లో మెప్పించింది. ఇక ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లుగా రూపొందుతుంది. దీనికి సయ్యద్ జైద్ అలీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.ఇక సమంత మాట్లాడుతూ తల్లి కావాలంటూ బయటపెట్టిన కోరికను త్వరలోనే పెళ్లి చేసుకుని నెరవేర్చుకుంటుందేమో చూడాలి.