కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన పిరియాడికల్ ఫిలిం కంగువా. అత్యంత భారీ బడ్జెట్లో యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా.. కేఏ జ్ఞానవేల్ రాజా, వంశి, ప్రమోద్ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు.. దిశాపటని, బాబి డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అంతేకాదు ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించింది. ఇక ఈ సినిమాకు డిఎస్పి అందించిన ధీర ధీర కథన విహార.. ధీర.. పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మరింత ఆసక్తిని నెలకొల్పింది. ఈ క్రమంలోనే కంగువా గురించి ఓ క్రిటిక్ ఫస్ట్ రివ్యూ షేర్ చేసుకున్నాడు.
కంగువా వెయ్యి ఏళ్ల కిందట ఐదు తెగల మధ్య జరిగిన పోరాటం.. బ్యాక్ డ్రాప్ తో రూపొందిందని టాక్. ఓటమియరుగని ఓ ధీరుడు కంగువా.. మరోవైపు ప్రజెంట్ జనరేషన్ యువకుడిగా సూర్య.. డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక అప్పటి జనరేషన్లో కంగువ ఇచ్చిన మాట ఏంటి..? కంగువను మోసం చేసింది ఎవరు..? కంగువానే మళ్లీ పుట్టాడా..? అతడి పోరాటం ఎవరికోసం..? ఆత్మగౌరవం కోసం ప్రాణాలను తెగించాడా..? అతడి ప్రామిస్ ఈ జనరేషన్ యువకుడు ఎలా నిలబెట్టాడు..? అనేది సినిమా కథ అనే ప్రచారం నడుస్తుంది. అయితే తాజాగా కంగువ పై సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దుబాయ్ కి చెందిన స్వయం ప్రకటిత క్రిటిక్ ఉమైర్ సందు తన రివ్యూ షేర్ చేసుకున్నాడు.
తను దుబాయ్ సెన్సార్ బోర్డ్ స్క్రీనింగ్ టైంలో మూవీని చూశానని.. సినిమా అద్భుతంగా ఉందంటూ వెల్లడించాడు. తన రివ్యూలో సూర్య పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు కురిపించిన ఉమైర్.. ఓవరాల్ గా కంగువా బాగున్నట్టు చెప్పుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ స్లోగా అనిపించినా.. సెకండ్ హాఫ్ విధ్వంసమే.. క్లైమాక్స్ అయితే అదరగొడుతుంది.. మూవీ చూసిన తర్వాత కచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతారు అంటూ వివరించాడు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ హిట్ అని అంతా అంటారు. కానీ.. భావితరాలు ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ గా ఫీల్ అవుతారు అంటూ సంధు వెల్లడించాడు. ఇక ఈ సినిమాల్లో సూర్య పర్ఫామెన్స్ తో ప్రతి ఒక్కరి మనసును దోచుకోవడం ఖాయం. పెర్ఫార్మెన్స్ టెరఫిక్. దిశ బోల్డ్, రొమాంటిక్ సీన్స్ లో దుమ్ము దులిపేసింది. దీపావళి సినిమాలు వదిలి ఈ సినిమాను చూడండి మంచి అనుభూతి వస్తుంది అంటూ ఉమైర్ షేర్ చేసుకున్నాడు.