మొదటిసారి పెళ్లి వార్తలపై రియాక్ట్ అయిన అనుష్క.. ఇక చాలు ఆపండంటూ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ అనుష్కకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడికి మంచి ఇమేజ్‌ క్రియేట్ అయింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‌గా పాపులారిటి సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళ భాషలను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఆకట్టుకుంది. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.

అయితే ఈ సినిమా తర్వాత చాలా కాలం పాటు తన వ్యక్తిగత కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన స్వీటి.. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. చాలాకాలం ఇండస్ట్రీకి దూరమైనా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులోనే కాదు కన్నడ, మలయాళ భాషల్లోనూ తన సత్తా చాటుతున్న అనుష్క.. తాజాగా ఘాటి సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించడానికి సిద్ధమైంది. ఇక మొదటిసారి మలయాళ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది స్వీటీ. ఇదిలా ఉంటే అమ్మడి పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రభాస్, అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ పెళ్లి చేసుకుంటున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వినిపించినా.. వాటిని ఇద్దరు ఖండిస్తూ వచ్చారు.

ప్రభాస్ తను ఇద్దరు మంచి స్నేహితులని అనుష్క చెప్తూ ఉండేది. అంతే కదా ఇటీవల కాలంలో ఈమె ఇండస్ట్రీకి దూరం అవడంతో ఓ ప్రముఖ బిజినెస్ మాన్‌ను పెళ్లి చేసుకుంటుంది అంటూ.. అందుకే ఇండస్ట్రీకి దూరమైందంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలో పెళ్లి వార్తలపై రియాక్ట్ అయిన అనుష్క.. ప్రతి ఒక్కరూ నా పెళ్లి పెళ్లి అంటూ తెగ వార్తలు రాస్తున్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో.. జరిగిందో మాత్రం చెప్పడం లేదు. పెళ్లి విషయంలో దాచాల్సినంత అవసరం ఏమీ ఉండదు. అది నేరం కాదు. అదొక ఎమోషనల్ జర్నీ. ఇకనైనా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి అంటూ ఫైర్ అయింది. ఆ సమయం వస్తే ప్రతి ఒక్కరితో నేనే షేర్ చేసుకుంటాను అంటూ అనుష్క వెల్లడించింది. ప్రస్తుతం అనుష్క చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.