చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ.. చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్గా నిలిచి పెద్ద సినిమాలను పక్కకు తోసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానికి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన హనుమన్ మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో కూడా ఇలానే ఓ చిన్న సినిమా ఏకంగా మెగాస్టార్ సినిమాకు పోటీగా రిలీజై ఏకంగా 6 నంది అవార్డులను కొలగొట్టడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆనంద్ మూవీ.
ఈ సినిమా విడుదలైన టైంలో శేఖర్ కమ్ములకి, హీరో రాజా, హీరోయిన్ కమిల్ని ముఖర్జీకి అసలు ఏమాత్రం ఇమేజ్ లేదు. వాళ్ళు ఎవరో కూడా చాలా వరకు ఆడియన్స్ కు తెలియదు. అలాంటి ఆనంద్ సినిమా.. చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమాకి పోటీ వచ్చి మరి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2004 అక్టోబర్ 15న శంకర్ దాదా జిందాబాద్ సినిమా రిలీజ్ కాగా అదే రోజున ఆనంద్ మూవీని కూడా అతి తక్కువ థియేటర్లో రిలీజ్ చేశారు. ఓవైపు చిరంజీవి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంటే.. మరోవైపు ఆనంద్ సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అలా రోజురోజుకు సినిమా టాక్ మరింతగా పెరుగుతూ సూపర్ హిట్ గా మారింది.
ఇక శేఖర్ కమ్ముల తన సరికొత్త ఫిలిమ్ మేకింగ్ స్టైల్ తో ఆడియన్స్ కి, యూత్ కి నచ్చేలా కథను డిజైన్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. కాగా మొదట ఈ సినిమా కథను డైరెక్టర్ పవన్ కోసం రాసుకున్నాడట. ఆయనను కలవడం కుదరకపోవడంతో.. రాజా, కమల్ని ముఖర్జీలతో సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు ఏకంగా 6 నంది అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. బెస్ట్ ఫీచర్ ఫిలిం, అలాగే బెస్ట్ డైరెక్టర్ – శేఖర్ కమ్ముల, ఉత్తమ నటి – కమల్ని ముఖర్జీ, ఉత్తమ సహనటి – సత్యా కృష్ణన్, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా మొత్తం ఆరు విభాగాల్లో ఆనంద్ సినిమా నంది అవార్డులు దక్కించుకోవడం విశేషం.