సినీ ఇండస్ట్రీలో తమతో కలిసి నటించే కోస్టార్స్‌ను ఫ్రెండ్స్‌గా ట్రీట్ చేయడం.. వారితో కష్టసుఖాలు పంచుకోవడం. అలాగే వారిని సర్ప్రైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం.. ఇలాంటివన్నీ కామన్ గానే జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన.. పుష్ప తో అమ్మడికి కోస్టార్గా మారిపోయిన బన్నీ కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఇంతకీ రష్మిక ఏం చేసిందో అసలా గిఫ్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కిరాక్ పార్టీ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేషనల్ క్రష్‌గా ఎదిగిన ఈ చిన్నది.. తెలుగులో ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చి గీతగోవిందం, సరిలేరు నీకెవరు, భీష్మా, పుష్ప సినిమాలతో క్రేజ్ను రెట్టింపు చేసుకుంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనూ అవకాశాలు క్యూ కట్టాయి. ఇక తాజాగా అమితాబచ్చన్ నటించిన గుడ్ బాయ్ సినిమాలోని నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక.. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప2తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో ఈ మూవీ విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం హైదరాబాద్ తో పాటు చెన్నై, బెంగళూరు, ముంబైలోను ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారట. టీజర్, ట్రైలర్ కట్‌లు కూడా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా మెరవానుంది రష్మిక. పుష్ప తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పుష్ప సీక్వెల్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవాలని ఆరాటపడుతుంది. ఈ క్రమంలోనే తనతో కలిసి ఐదేళ్లు పనిచేసిన అల్లు అర్జున్‌తో రష్మికకు మంచి స్నేహం ఏర్పడిందట. అలా తాజాగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ అల్లు అర్జున్ కు స్పెషల్ కానుక పంపించింది. వెండిని బహుమతిగా అందుకున్న వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుందని మా అమ్మ చెప్పింది.. నేను పంపిన ఈ వస్తువుతో మీకు మరింత అదృష్టం, ప్రేమ దక్కుతాయని అనుకుంటున్నా అంటూ నోట్ రాసింది. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ థాంక్యూ డియర్.. నాకు చాలా అదృష్టం కావాలని రిప్లై ఇచ్చాడు. దీనిపై రష్మిక మరోసారి రియాక్ట్ అవుతూ.. పుష్ప బాక్సాఫీస్ దగ్గర రూల్ చేస్తాడు. చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి.