టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. నార్త్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎలాగైనా చరణ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొని.. మార్కెట్ మరింతగా పెంచుకోవాలని కష్టపడుతున్నాడు.
ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ ఓ హీరోతో మల్టీస్టారర్‌కు నో చెప్పాడని..ఆ హీరోతో కలిసి ససేమీరా చేయనంటూ తెగేసి చెప్పాడంటూ వార్తలు వైరల్గా మారాయి. అయితే ఆ సినిమా ఏంటో క్లారిటీగా తెలియదు గానీ.. తాజాగా రామ్ చరణ్ సినిమాలో మరో టైర్ 2 హీరోని పెట్టాలని ఆ మూవీ డైరెక్టర్ భావించాడట. చరణ్‌కు ఆ విషయం చెప్పగ ఏది ఏమైనా ఆ హీరోతో మాత్రం నేను నటించడానికి ఒప్పుకోనని చెప్పేసాడట. ఒకవేళ ఆ హీరో ని కనుక సినిమాలో పెడితే.. సినిమా నుంచి తప్పుకుంటానంటూ తెగేసి చెప్పాడట.
ఇంతకీ ఆ టైర్ 2 హీరోను వద్దని చెప్పడానికి కారణం తెలియదు కానీ.. చరణ్ అంతగా చెప్పడంతో చేసేదేమీ లేక ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని ఆ హీరో పాత్రలో తీసుకొని మూవీ ఫినిష్ చేయాలని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడట. అయితే.. ఇంతకీ రామ్ చరణ్ ఆ హీరోతో ఎందుకు అసలు చేయడానికి ఇష్టపడడం లేదు.. వారిద్దరి మధ్యన ఏదైనా గొడవ ఉందా.. లేదా మరి ఏదైనా ఇష్యునో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే చరణ్ యాంటీ ఫ్యాన్స్ అంతా ఈయన కంటే గొప్పగా ఆహీరో నటిస్తాడని జలస్‌తో వేరే హీరోతో మల్టీ స్టారర్ చేయడానికి ఒప్పుకొని ఉండడు అంటూ.. ఈయన పెద్ద గ్లోబల్ స్టార్ కదా.. అందుకే టైర్ 2 హీరోలతో నటించడేమో అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.