టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కమెడియన్ సునీల్ హీరోగా పరిచయం చేసిన మర్యాద రామన్న సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కథానాయకగా సలోని నటించగా.. నాగినీడు, సుప్రీత, ప్రభాకర్, బ్రహ్మాజీ, సుబ్బరాయ శర్మ, రావు రమేష్, చత్రపతి శేఖర్, కాంచి తదితరులు కీలకపాత్రలో కనిపించి మెపించారు. ఇక 2013లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. స్టార్ క్యాస్ట్ లేకపోయినా.. ఆడియన్స్‌కు కావలసిన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ జక్కన్న సినిమాతో అందించాడు. ఇక ఈ సినిమాల్లో ట్రైన్ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇక.. ఏం రావట్లేదా అంటూ.. ట్రేడ్ మార్క్ డైలాగ్ తో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించిన నటుడు కాంచి అందరికీ గుర్తుండే ఉంటాడు. అన్నట్లు అయినా మరెవరో కాదు రాజమౌళి కజిన్. అమృతం సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన కాంచి టాలెంటెడ్ డైరెక్టర్ కమ్.. యాక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. మర్యాద రామన్నతో సినీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే కాంచి నటుడే కాదు.. ఓ మంచి రచయిత కూడా అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. జక్కన్న తెరకెక్కించిన మర్యాద రామన్న, ఈగ, మగధీర సినిమా రైటర్ కాంచినే కావడం విశేషం. అలాగే శ్రీకృష్ణ 2026, ఏమో గుర్రం ఎగరావచ్చు లాంటి సినిమాలకు డైలాగ్ కూడా కాంచి వ్యవహరించాడు.
ఇక మర్యాద రామన్న తర్వాత నితిన్ సై సినిమాలోను జెనీలియా ఫాదర్ గెటప్ లో కనిపించాడు. ఇక రాజమౌళితో పాటు.. కీరవాణి కూడా కాంచికి బ్రదర్ అవుతాడు. అలా కీరవాణి కొడుకు శ్రీ సింహ ఈయనకు కొడుకు వరుస. శ్రీ సింహ ఇటివల మత్తు వదలరా 2తో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీ సింహ.. కాంచి తో మొదటి నుంచి చాలా ప్రేమగా ఉంటాడట. అలాగే సింగర్ కాలభైరవ, ఎస్ ఎస్ కార్తికేయలను కూడా కొడుకులా ప్రేమగా చూస్తాడట. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన రిలేషన్ వైరల్ గా మారుతుంది. అయితే జై సింహ, కాంచి ఇంత దగ్గర బంధువులని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.