వాళ్లకి అన్యాయం జరిగితే అసలు సహించలేను బాలయ్య షోలో బన్నీ ఎమోషనల్.. ప్రోమో(వీడియో)..

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. ఇక ఈ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజ‌రు కాగా.. రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ సూర్య గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. పుఏష్ప 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ సందడి చేయనున్నాడు. ఇక ఇందులో బాలయ్య, బన్నీల మధ్య జరిగిన క్రేజీ సంభాషణల ప్రోమో నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది.

Unstoppable 4: అదే చిరు బన్నీల బంధం.. నేషనల్ అవార్డ్ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్.. | Allu Arjun Comments on Chiranjeevi in Balakrishna Unstoppable with NBK Season 4 Episode 4th - Telugu ...

ఇందులో బాలయ్య బన్నీని నేషనల్ అవార్డు పై తన‌ ఫీలింగ్ గురించి ప్రశ్నించగా.. ఆయన రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. బన్నీ మాట్లాడుతూ.. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదని ఎంతో బాధప‌డ్డా.. ఎలాగైనా సాధించాలనుకున్న అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. తర్వాత బాలయ్య.. చిరంజీవి, మహేష్ బాబు లతో సహా ఎంతమంది స్టార్ హీరోలను చూపిస్తూ వారిని చూడగానే ఏమి గుర్తొస్తుందని ప్రశ్నించగా.. చిరంజీవి, మ‌హేష్‌తో తనకున్న బాండింగ్ గురించి బ‌న్నీ షేర్ చేసుకున్నాడు.

ఇక అల్లు అర్జున్‌తో బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్ అన‌గా.. ఎలా అని బన్నీ అడిగాడు. నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని ఆయన చెప్పుకొచ్చాడు. దానికి బ‌న్నీ రియాక్ట్ అవుతూ మీరు గీత ఇవ్వండి.. మేము కురుక్షేత్రం చేస్తామంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ఈ షోలో అల్లు అర్జును మీకు బాగా కోపం తెప్పించే విషయం ఏంటి అని ప్రశ్నించగా.. అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే నాకు నిజంగా బాగా కోపం వస్తుంది.. అసలు సహించలేను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ప్రోమో వైరల్ గా మారుతుంది. మీరు ఓ లుక్ వేసేయండి.