టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్.. విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో దేవర సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా క్రేజ్‌తో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. అలా ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్లో విపరీతమైన హైప్ సంపాదించుకున్న వారిలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే.. తర్వాత అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ లిస్టులో మూడో స్థానంలో తారక్ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా కేవలం కొరటాల.. దేవర సినిమా వల్లే సాధ్యమైంది. దీంతో కొరటాల – ఎన్టీఆర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడంటూ.. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2.. బాలీవుడ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తారక్ తలపడనున్నాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే.. ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్‌లోనూ మరింతగా పెరుగుతుంది. ఇక ఈ సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత దేవర పార్ట్ 2 మూవీలో తారక్ కనిపిస్తాడు. ఇక ఎన్టీఆర్ నుంచి తర్వాత రాబోయే సినిమాలు కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటే ఎన్టీఆర్ మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.