టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మంచి ఇమేజ్తో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్న మహేష్.. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు మహేష్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ మెకోవర్ పనిలో కసరత్తులు చేస్తు.. సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.
ఇక రాజమౌళి సినిమా అంటే మహేష్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ రావడం ఖాయం. ఈ క్రమంలో రాజమౌళి డైరెక్షన్లో సినిమా తర్వాత.. మహేష్ ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడని ఆసక్తి అభిమానుల్లో కచ్చితంగా ఉంటుంది. దీనిపై తాజాగా ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. మహేష్, కొరటాల మధ్యన మొదటి నుంచి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో మొదట శ్రీమంతుడు సినిమా వచ్చి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత భరత్ అనే నేను సినిమా కూడా ఇదే రేంజ్ లో సక్సెస్ లో అందుకుంది.
ఇలా మహేష్ కి, కొరటాలకి మధ్య ఉన్న బాండింగ్ తో తెరకెక్కిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాగా కొన్ని రోజుల క్రితమే కొరటాల.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కొరటాలతో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న తర్వాత మహేష్, కొరటాల కాంబోలో నిజంగానే ఓ సినిమా సెట్ అయితే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొంటాయి అనడంలో సందేహం లేదు.