మెగా అభిమానులకు బిగ్ గుడ్ న్యూసా.. ఇంతకి ఎంటి ఆ న్యూస్ అనుకుంటున్నారా.. అదేంటో ఎకసారి చూద్దాం. చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని రోజుల్లో కిక్ ఇచ్చే అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు రానున్నయట. అసలే ఈ మెగా హీరోలు ఇద్దరు బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా గ్యాప్ రావడంతో.. సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన భోళా శంకర్ రిలీజై ఏడాది దాటిపోవడం.. పైగా ఈ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక రామ్చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజై కూడా దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది. ఈ క్రమంలో రామ్ చరణ్.. గేమ్ చేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో అటు విశ్వంభర.. ఇటు గేమ్ చేంజెర్ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రివిల్ కానున్నాయని ఇండస్ట్రీలో నుంచి టాక్ వినిపిస్తుంది. దసరా కానుకగా రెండు సినిమాల టీజర్లు రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఈ టీజర్ విడుదల చేయాలని మూవీ టీం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు టాక్. గేమ్ చేంజర్కు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నా థమన్.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా దసరాకు టీజర్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు.
విశ్వంభర టీజర్ కూడా అదే టైంలో రిలీజ్ అయితే ఇక మెగా ఫ్యాన్స్ కు డబ్బులు ధమాకా అనడంలో సందేహమే లేదు. ఇక రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చిరంజీవి విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సిద్ధం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏది ఏమైనా మొత్తం మీదగా దసరా పండుగకు మెగా అభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్ రానున్నాయి. మెగా హీరోస్ చరణ్, చిరు రెండు సినిమాల టీజర్లు విడుదలతో మెగా ఫాన్స్ కు పండగ వాతావరణం మొదలుకానుంది.