‘ దేవర ‘ తర్వాత తారక్ – నీల్ మూవీ సరికొత్త ప్రభంజనం.. ఏకంగా రూ. 3000 కోట్లు.. గూస్ బంప్స్ మోత‌

నందమూరి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవల వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ‌డంతో వారిలో పండగ వాతావరణం నెలకొంది. అంతేకాదు ఓ పక్కన బాలయ్య వ‌రుస‌ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. మరో పక్క రాజకీయాల్లోనూ టిడిపి పై చేయి సాధించింది. ఇప్పుడు తారక్ నటించిన దేవర పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బ‌స్టర్.. త్వరలో బాలయ్య బాబు త‌న‌యుడు మోక్షజ్ఞ డెబ్యు మూవీ.. ఇలా వరుసగా నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ లు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇక తాజాగా దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే దేవ‌ర‌ పార్ట్‌2 షూటింగ్ కూడా ప్రారంభమైపోతుందని తార‌క్ మీట్‌లో వివ‌రించాడు.

NTR and Prashanth Neel Film all set for a Grand Launch

ఇక దేవ‌ర పార్ట్ 2 కంటే ముందు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ కాంబోలో సినిమా రానుందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని టాక్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిపారు. ఈ సినిమా కథ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎవరు చూడని విధంగా ఎంతో వైవిధ్యంగా తెర‌కెక్క‌నుద‌ని.. ఇందులో లోకనాయకుడు కమలహాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ నట విశ్వ‌రూపం ఎలాంటిదో తెలిసిందే. ఇక నేటి తరంలో టాలీవుడ్ మహానటుడు ఎన్టీఆర్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమాల్లో కనిపిస్తున్నారు అంటే చాలు.. బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అనే రేంజ్ లో అభిమానుల్లో అంచనాలు మొదలవుతాయి.

తారక్ ప్రశాంత్ నీల్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. ఆ మూవీ టైటిల్ ఇదే

ఇద్దరి టాలెంట్ పూర్తిగా వాడుకునే ప్రశాంత్ నీల్‌.. ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నడట. కేవలం కమల్ పాత్ర మాత్రమే కాదు.. ఎన్టీఆర్ పాత్రకు కూడా నెగిటివ్ షేడ్స్‌ ఉంటాయని తెలుస్తుంది. కొరటాల లాంటి సాధారణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమా తెర‌కెక్కిస్తేనే పాన్ ఇండియా లెవెల్ లో తారక్ సినిమాపై ఎలాంటి అంచనా నెలకొన్నాయో చూసాం. ఓపెనింగ్ వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనకాపల్లి టు అమెరికా దేవర తోనే రికార్డుల వర్షం కురిపించిన ఎన్టీఆర్.. భారీ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్ర‌శాంత్ నీల్‌ సినిమా తీస్తే ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో అసలు గెస్ట్ కూడా చేయలేము. ఈసారి రూ.1000 కోట్లు వేయికోట్లు కాదు.. ఏకంగా రూ.3000 కోట్ల‌ క్లబ్ లోకి ఎన్టీఆర్, నీల్ సినిమా చేరిపోయిన సందేహం లేదు. ఆ రేంజ్ లో ఎన్టీఆర్.. ప్రశాంత్‌ ఇప్పటికే ఆడియన్స్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.