బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..

నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన మోక్షజ్ఞ.. మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం పక్కా అంటూ

కాగా మహాభారతం బ్యాక్ డ్రాప్ లో మూవీ రానుందంటూ గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవార్త నిజమైందని తాజా సమాచారం. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలకృష్ణ కృష్ణుడిగా, ఎన్టీఆర్ అర్జునుడిగా కనిపించబోతున్నారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఫ్యాన్స్ లో మాత్రం ఫుల్ ఆనందాన్ని క‌లిపిస్తున్నాయి. ఇక ఈ న్యూస్‌ నిజమైతే ఇక నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకోవచ్చు అనడంలో సందేహాలు లేవు. ఓకే సినిమాల్లో.. అది మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాలో.. బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కూడా తోడైతే ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Uncle Vs Nephew: Nandamuri Balakrishna's NBK109 To Clash With Jr NTR's Devara At Box office | Telugu News, Times Now

ఇక బాలకృష్ణ అడిగితే ఎన్టీఆర్ నో చెప్పే అవకాశం ఉండదు. కాగా.. గత కొంతకాలంగా బాలయ్య, ఎన్టీఆర్‌కు మంచి గడియలు నడుస్తున్నాయి. ఇద్దరు తెర‌కెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్నాయి. షేర్ కలెక్షన్లను లాభాల బాటలో నడిపిస్తున్నాయి. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియన్స్‌లో మంచి మార్కులు పడ్డాయి. కాగా ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించినా ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను ఫైనల్ చేయ‌నున్నారంటూ సమాచారం. ఇక ఈ నందమూరి నయా హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.