‘ దేవర ‘ మూవీ సక్సెస్ కోసం అలాంటి పనిచేస్తున్న దర్శక, నిర్మాతలు.. మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..

కొరటాల శివ డైరెక్షన్‌.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా ఈనెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో టీమ్ అంతా బిజీ బిజీగా గ‌డుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకులు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అదే రేంజ్ లో ఏర్పాట్లు చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈవెంట్‌ తెలుగు ఆడియన్స్ మెచ్చే విధంగా.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా.. అలాగే సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసి సినిమాపై మరింత హైప్‌ను పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

NTR Birthday poster: Reveals calm side of Devara

దీంతో పాటు సినిమా హైట్ రెట్టింపు అవ్వాలంటే మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోని గెస్ట్ గా ఇన్వైట్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట దర్శక, నిర్మాతలు. ఇక ఇప్పటికే దేవరపై ప్రేక్షకుల్లో భారీ లెవెల్ లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడం.. ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బ‌స్టర్ తర్వాత ఈ సినిమా రావ‌డంతో నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాలో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Devara Trailer Review | cinejosh.com

ఈ క్రమంలో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న హైదరాబాద్లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారని తెలుస్తుంది. ముందు ఏపీలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కానీ.. విజయవాడలో వరదల కారణంగా ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసి హైదరాబాదులో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉన్న ఏపి డిప్యూటీ సీఎం పవన్ ను.. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఇందులో స్పెషల్ గెస్ట్ గా తీసుకువస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో మేకర్స్‌ క్లారిటీ ఇస్తేగాని తెలియదు.